Advertisementt

ప్రియుడితో ఖుషీ క‌పూర్ బ్రేక‌ప్

Sun 11th Jan 2026 09:43 AM
khushi kapoor  ప్రియుడితో ఖుషీ క‌పూర్ బ్రేక‌ప్
Khushi Kapoor Breakup With Her Boyfriend ప్రియుడితో ఖుషీ క‌పూర్ బ్రేక‌ప్
Advertisement
Ads by CJ

2023 డిసెంబ‌ర్ లో `ది ఆర్చీస్` వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ లోకి వ‌చ్చింది. ఆ సిరీస్ ఎలా ఉంది? అనే దాని కంటే, ఇందులో న‌టించిన యువ జంట‌ల ప్రేమాయ‌ణాల‌ గురించి ఎక్కువ‌గా చ‌ర్చ సాగింది. నేపో కిడ్స్ ఖుషీ క‌పూర్, సుహానా ఖాన్, ప్ర‌స్తుతం ఇక్కీస్ తో విజ‌యం అందుకున్న అమితాబ్ మ‌న‌వ‌డు అగ‌స్త్య‌ నందా, దిల్లీలో నివ‌శించే క‌శ్మీరీ పండిట్ కుమారుడైన వేదాంగ్ రైనా, ఇంకా మ‌రికొంద‌రిని ప‌రిచ‌యం చేస్తూ `గ‌ల్లీబోయ్` ఫేం జోయా అక్త‌ర్ ఈ సిరీస్ ని రూపొందించారు. సిరీస్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అగ‌స్త్య నందా- సుహానా, వేదాంగ్ రైనా- ఖుషీ క‌పూర్ జోరుగా ప్రేమాయ‌ణాలు సాగించారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

 

అయితే ఇంత‌లోనే ఖుషీక‌పూర్  - వేదాంగ్ రైనా జంట విడిపోయారు అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఏడాది వ‌య‌సున్న ప్రేమ అప్పుడే వీగిపోయిందా? అంటూ అభిమానులు సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా ఖుషీ, వేదాంగ్ ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా విభిన్న‌మైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతున్నారు. ఖుషీ ప్ర‌స్తుతం మామ్ సీక్వెల్ లో న‌టిస్తూ బిజీగా ఉంది. వేదాంగ్ రైనా ఇటీవ‌ల ఆలియాతో క‌లిసి జిగ్రా అనే ఫ్లాప్ సినిమాలో న‌టించాడు. ఆ త‌ర్వాత అత‌డి త‌దుప‌రి సినిమా గురించి ఎలాంటి చ‌ర్చా జ‌ర‌గ‌డం లేదు. ఇంత‌లోనే ఇప్పుడు ప్రియురాలు ఖుషీతో వేదాంగ్ బ్రేక‌ప్ అయ్యాడ‌న్న ప్ర‌చారం మ‌రింత క‌ల‌చి వేస్తోంది.

 

ఇటీవ‌ల తన స్నేహితురాలు ఆలియా క‌శ్య‌ప్ బ‌ర్త్ డే పార్టీలో ఖుషీ ఒంట‌రిగా క‌నిపించ‌డంతో అనుమానాలు మ‌రింత రాజుకున్నాయి. ఖుషీతో క‌లిసి జంట‌గా ఫోటోషూట్లు లేవ్.. క‌లిసి షికార్లు లేవ్.. దీంతో వేదాంగ్ తో బ్రేక‌ప్ క‌న్ఫామ్ అయింద‌ని భావిస్తున్నారు. అయితే డేటింగ్ గురించి కానీ, బ్రేక‌ప్ గురించి కానీ ఈ జంట ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా స్పందించ‌లేదు.

Khushi Kapoor Breakup With Her Boyfriend:

  Khushi Kapoor Breakup  

Tags:   KHUSHI KAPOOR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ