2026 లో సంక్రాంతికి కేవలం ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ మాత్రం బాక్సాఫీసు బరిలోకి వచ్చాయి. ప్రతి సంక్రాంతి కి యాక్షన్ ఎంటెర్టైనెర్స్ తో సందడి చేసే హీరోలు ఈసారి కామెడీ, ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ తో దిగుతున్నారు. అందులో ముందుగా ఈ శుక్రవారం జనవరి 9 నే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజసాబ్ థియేటర్స్ లోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్లాప్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్నికి అన్ని వైపుల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ కనిపిస్తుంది. అభిమానులకు ఎలా ఉన్నా కామన్ ఆడియన్స్ అలాగే రివ్యూ రైటర్స్ అంతా నెగెటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఓపెనింగ్ డే, శనివారం రాజసాబ్ కి మంచి కలెక్షన్స్ రావొచ్చు.
ఆదివారం కూడా రాజసాబ్ బుకింగ్స్ అంతంతమాత్రంగా కనిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి స్పెషల్ గా రెండో సినిమా గా జనవరి 12 న వస్తుంది మెగాస్టార్-అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారు. ఆ తర్వాత రోజు జనవరి 13 న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి వస్తుంది.
ఇక భోగి రోజున నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి చిత్రాలు రాబోతున్నాయి. మరి ఇప్పటికి రాజాసాబ్ ముచ్చట ముగిసింది, ఇక ఈ నాలుగు సినిమాల ముచ్చట మిగిలి ఉంది, ఇవేం చేస్తాయో అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నాయి.




ప్రియుడితో ఖుషీ కపూర్ బ్రేకప్
Loading..