Advertisementt

PR పంచ్ - థగ్ లైఫ్ తేలిపోవ‌టానికి కార‌ణాలు

Fri 06th Jun 2025 09:08 PM
pr punch  PR పంచ్ - థగ్ లైఫ్ తేలిపోవ‌టానికి కార‌ణాలు
Top 5 reasons behind Thug Life Movie flop PR పంచ్ - థగ్ లైఫ్ తేలిపోవ‌టానికి కార‌ణాలు
Advertisement
Ads by CJ

క‌మ‌ల్ హాస‌న్ - మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ సినిమా అన‌గానే అభిమానులు ఎంతో ఎగ్జ‌యిట్ అయిపోయారు. ఎపుడెపుడా.. అని ఎదురు చూసారు. థ‌గ్ లైఫ్ రానే వ‌చ్చింది.. కానీ నీరసం తెచ్చింది. ఇద్ద‌రు లెజెండ్స్ క‌లిసి ప‌ని చేసారు ఏం లాభం.. అంటూ ప్రేక్ష‌కులు పెద‌వి విరిచేయ‌డం వెన‌క టాప్ - 5 కార‌ణాలు ఇవిగో ఇలా ఉన్నాయి.

థ‌గ్ లైఫ్ - టైటిల్ తో స‌రితూగ‌ని క‌థ‌. థ‌గ్ అంటే దొంగ‌. ఇందులో దొంగ‌త‌నాలే లేవు. టైటిల్ చూసి మోస‌పోయిన జ‌నం. A నుంచి Z వ‌ర‌కూ ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాని మాఫియా వాళ్ల‌ను థ‌గ్ అన‌డమే రాంగ్!

చంద‌మామ‌, బాల‌మిత్ర‌, బుజ్జాయి క‌థ‌ల్లో థ‌గ్ ని ఊహించుకుని థియేట‌ర్ కి వెళితే తీవ్ర నిరాశే. 80లు 90ల‌లో యూత్ కి క‌థ‌ల పుస్త‌కాలు బాగా చ‌దివే అల‌వాటు ఉంది. వారికి అస‌లే న‌చ్చ‌దు. బంధిపోటు దొంగ అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఊహించుకుని థియేట‌ర్ కి వ‌స్తే, అంతా నిరాశే. అస‌లు దొంగ‌తనాలు ఎక్క‌డ సినిమాలో..

నేను లోన ఉన్నప్పుడు నువ్వు బ‌య‌ట చూస్కో అంటాడు శింబుతో క‌మ‌ల్ హాస‌న్. కానీ స‌వ‌తి తండ్రి కొడుకు లోన బ‌య‌ట ఏం చూస్కున్నారో ఎవ‌రికీ ఏమీ తెలీదు. వీళ్ల చీక‌టి వ్యాపారాల దందా ఏంటో ఇంట్రెస్టింగ్ గా చూపించ‌లేదు. మ‌ణిర‌త్నం సినిమాల్లో ప్ర‌తి పాత్రా బ‌లంగా క‌నిపిస్తాయి. అస‌లు అన్ని పాత్ర‌లు వీక్ గా తేలిపోయాయి.

ఇది నేటి జెన్ జెడ్ సినిమా కాదు. ఎందుకంటే.. అవెంజ‌ర్స్, బ్యాట్ మేన్, కెప్టెన్ అమెరికా, సూప‌ర్ మేన్, అవ‌తార్, బ్లాక్ పాంథ‌ర్, బాండ్ 007, ఎంఐ సిరీస్ సినిమాల‌కు అల‌వాటు ప‌డ్డాక‌, థ‌గ్ లైఫ్ లాంటి పాత చింత‌కాయ లైన్ తో సినిమాలు ఎవ‌రు చూస్తారు? బాగా ఔట్ డేటెడ్ మైండ్ సెట్స్ ని ఇప్పుడు ఎవ‌రూ ఎంట‌ర్ టైన్ చేయ‌రు. మ‌ణిర‌త్నం ఔట్ డేటెడ్ ప‌క్కా.. నో డౌట్స్.

కేజీఎఫ్‌, స‌లార్, కల్కి 2898 ఏడి, విక్ర‌మ్, క్రిష్ ఫ్రాంఛైజీ, టైగ‌ర్ ఫ్రాంఛైజీ, యానిమ‌ల్ ఫ్రాంఛైజీ .. వీటిలో ఉన్న ఫీల్ లో ఒక శాతం కూడా థ‌గ్ లైఫ్ లో చూపించ‌డంలో మ‌ణిర‌త్నం విఫ‌ల‌మ‌య్యాడు. అలాంటి గొప్ప పాన్ ఇండియా సినిమాలు వ‌స్తున్న ఈ రోజుల్లో మ‌ణిర‌త్నం ఔట్ డేటెడ్ స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు? క‌నీసం క‌మ‌ల్ హాస‌నే న‌టించిన విక్ర‌మ్ సినిమా కాలి గోటికి అయినా స‌రితూగుతుందా ఇది?

ఎగ్జాక్ట్ గా కాదు కానీ సందీప్ రెడ్డి యానిమ‌ల్ కూడా తండ్రి కొడుకుల క‌థ‌. కానీ ప్ర‌తి స‌న్నివేశంలో ఫీల్ అనుభ‌వించ‌ని ప్రేక్ష‌కుడు లేడు. అలాంటి ఫీల్ ఏడుంద‌బ్బా థ‌గ్ లైఫ్ లో.. నేటి ఆడియెన్ హాలీవుడ్ రేంజు. ప్ర‌తి సీన్‌లో ఏదో ఒకటి హై కావాలి. అస‌లు ఏ సీన్ లోను హై అన్న‌దే లేదు థ‌గ్ లైఫ్‌లో.. కేవ‌లం క‌మ‌ల్ హాస‌న్ అసాధార‌ణ న‌ట ప్ర‌తిభ త‌ప్ప వేరే ఏదీ ఇందులో లేదు. కీల‌క‌మైన‌ శింబు రోల్ వీక్.. చంకీ పాండే రోల్ వీక్.. చివ‌రికి పొడిచేస్తాడు అనుకున్న విల‌న్ అలీ ఫ‌జ‌ల్ ఏమీ చేయ‌కుండానే చ‌స్తాడు. ఇలా కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు థ‌గ్ లైఫ్ పోవటానికి ఇలా ఎన్నో కారణాలు, ఇది మణిరత్నం రేంజ్ సినిమా కాదు అంటున్నారు ప్రేక్షకులు.

-పర్వతనేని రాంబాబు✍️

Top 5 reasons behind Thug Life Movie flop:

Reasons why Thug Life Movie is becoming more popular

Tags:   PR PUNCH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ