Advertisementt

మొన్న గేమ్ చేంజర్ ఇప్పుడు పెద్ది

Fri 06th Jun 2025 08:56 PM
game changer  మొన్న గేమ్ చేంజర్ ఇప్పుడు పెద్ది
Mega fans in panic mdoe మొన్న గేమ్ చేంజర్ ఇప్పుడు పెద్ది
Advertisement
Ads by CJ

పాపం మెగా ఫ్యాన్ కు రామ్ చరణ్ దర్శకులు కునుకు లేకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న గేమ్ చేంజర్ విషయంలో వాళ్ళెంత టెన్షన్ పడ్డారో అదే జరిగింది. ఇప్పుడు అదే టెన్షన్ పెద్ది విషయంలో పడుతున్నారు మెగా ఫ్యాన్స్. గేమ్ చేంజర్ అప్పుడు దర్శకుడు శంకర్ ఇండియన్ 2 తో బిగ్గెస్ట్ డిజాస్టర్ చవి చూశారు, ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పై పడుతుంది, శంకర్ గేమ్ చేంజర్ ని ఎలా తెరకెక్కిస్తారో అని మెగా ఫ్యాన్స్ ఆందోళన పడని రోజే లేదు. అప్పుడు మెగా ఫ్యాన్స్ ఊహించింది, భయపడిందే జరిగింది. 

శంకర్ గేమ్ చేంజర్ అవుట్ డేటెడ్ స్క్రిప్ట్ తో తెరకెక్కించి చరణ్ కి డిజాస్టర్ ని మెగా ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి మరో టెన్షన్ పెద్ది విషయంలో స్టార్ట్ అయ్యింది. పెద్ది చిత్రాన్ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు, అందులో ఆందోళన పడాల్సిన పనేముంది అనుకుంటున్నారు. 

కానీ బుచ్చిబాబు-రామ్ చరణ్ పెద్ది చిత్రానికి ఏరికోరి ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తెచ్చుకున్నారు. ఇప్పుడు రెహమాన్ నుంచి వచ్చిన థగ్ లైఫ్ విషయంలో రెహమాన్ మ్యూజిక్ కానీ, BGM కి కానీ పాజిటివ్ టాక్ రాకపోగా.. బోలెడన్ని విమర్శలొచ్చాయి. దానితో రెహమాన్ చరణ్ పెద్ది చిత్రాన్ని ఏం చేస్తారో అనే ఆందోళనలోకి మెగా ఫ్యాన్స్ వెళ్లిపోతున్నారు. 

మరి మెగా ఫ్యాన్స్ కి అప్పుడు శంకర్ కునుకు లేకుండా చేస్తే.. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కునుకులేకుండా చేస్తున్నారన్నమాట.

Mega fans in panic mdoe:

Game Changer vs Peddi

Tags:   GAME CHANGER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ