కళా సుధా అవార్డుల ప్రధానోత్సవం!

Sun 10th Apr 2016 03:25 PM
kala sudha awards,ganta srinivasarao,devisriprasad  కళా సుధా అవార్డుల ప్రధానోత్సవం!
కళా సుధా అవార్డుల ప్రధానోత్సవం!
Sponsored links

చెన్నై లో ఉగాది పర్వదినం సందర్భం గా ప్రతి ఏడాది ఇచ్చే శ్రీ  కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో భాగంగా మ్యూజిక్ అకాడమిలో ఈ ఏడాదికి సంబంధించిన విజేతలను  అవార్డు లతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి గంట శ్రీనివాస్ రావు పాల్గొని అవార్డు గ్రహీతలను సత్కరించారు. మహిళా రత్న అవార్డులను జస్టిస్ టి. మీనా కుమారి, శ్రీ. వనిత దాట్ల కు ప్రదానం చేసారు. ఈ అవార్డుల్లో భాగంగానే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు బాపు రమణ అవార్డు తో సత్కరించారు , సీనియర్ నటి ఆమనికి బాపు బొమ్మ  అవార్డుతో  సత్కరించారు . వంశి కృష్ణ  దొంగాటకు ఉత్తమ దర్శకుడిగా, రమ్య బెహరా (బాహుబలి )కి ఉత్తమ గాయనిగా, జ్వాల మేఘనకు (గోపాల గోపాల) ఉత్తమ బాలనటి, దేవిశ్రీ ప్రసాద్ కు (శ్రీమంతుడు) ఉత్తమ సంగీత దర్శకుడిగా, క్రాంతి మాధవ్ కు ఉత్తమ స్క్రీన్ ప్లే (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ), శివాజీ రాజాకు ఉత్తమ సహాయ నటుడు ( శ్రీమంతుడు ), హేమకు ఉత్తమ సహాయ నటి ( కుమారి 21 ఫ్)గా అవార్డు లు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ అకాడమి సెక్రటరీ పప్పు వేణు గోపాల రావు, కల సుధా వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని అవార్డు లు ప్రధానం చేశారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019