'పోలీసోడు' వచ్చేస్తున్నాడు!

Sun 10th Apr 2016 07:03 PM
polisodu movie,vijay,atlee,samantha,dil raju  'పోలీసోడు' వచ్చేస్తున్నాడు!
'పోలీసోడు' వచ్చేస్తున్నాడు!
Sponsored links

పిల్లల్ని బాధ్యతగా సరైన క్రమంలో పెంచితే.. దేశానికి గర్వకారణంగా నిలుస్తారు. ఇదే కాన్సెప్ట్ ను తీసుకొని 'పోలీసోడు' సినిమాను తెరకెక్కించామని చెప్పాడు దర్శకుడు అట్లీ.  విజయ్, సమంత, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం 'తేరి' ఈ సినిమాను 'పోలీసోడు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. ''నా మొదటి సినిమా 'రాజా రాణి' తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది. ఆ తరువాత తెలుగులో సినిమాలు చేయమని ఆఫర్స్ వచ్చాయి. కాని మెగా బడ్జెట్ సినిమా చేసిన తరువాత తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలనుకున్నాను. త్వరలో తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేస్తున్నాను. 'పోలీసోడు' ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.   మిత్ర పాత్రలో సమంత ఎమోషన్స్ బాగా పండించింది. సీనియర్ దర్శకులు మహేందర్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా'' అని తెలిపారు.

''నెల రోజుల క్రితం చెన్నై వెళ్ళినప్పుడు ఈ సినిమా ప్రోమోస్, పాటలు చూశాను. తెలుగులో నేనే రిలీజ్ చేయాలనుకున్నాను. అట్లీ మొదటి సినిమా 'రాజా రాణి' కూడా తెలుగులో నేనే రిలీజ్ చేయాలనుకున్నాను కానే కుదరలేదు. అట్లీ మొదటి సినిమా రేంజ్ లోనే ఈ సినిమా కూడా అనిపించింది. విజయ్, సమంత ల జంట హైలైట్ గా ఉంటుంది. సినిమా పాటలు కూడా బావున్నాయని అందరు చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందని'' దిల్ రాజు అన్నారు.

"ఇప్పటివరకు దాదాపు 25 కు పైగా చిత్రాల్లో నటించాను. ఆ సినిమాల విడుదల సమయంలో చాలా టెన్షన్ పడేదాన్ని. అయితే.. ''పోలీసోడు'' విషయంలో అలాంటి టెన్షన్ ఏమీ లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్, యాక్షన్, హ్యూమర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. నా కెరీర్ లోనే ఇదొక మంచి చిత్రంగా నిలిచిపోతుంది. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని'' సమంత చెప్పారు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్ , ఎడిటర్: అన్తోనీ రుబెన్, సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్: సతీష్ , సహా నిర్మాతలు: శిరీష్ , లక్ష్మణ్. నిర్మాతలు: రాజు , కలయిపులి ఎస్ థాను, దర్శకత్వం-స్క్రీన్ ప్లే: అట్లీ.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019