Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ: ఆర్.పి.పట్నాయక్

Wed 09th Mar 2016 07:40 PM
r p patnaik interview,thulasidalam movie,nischal  సినీజోష్ ఇంటర్వ్యూ: ఆర్.పి.పట్నాయక్
సినీజోష్ ఇంటర్వ్యూ: ఆర్.పి.పట్నాయక్
Advertisement

నిశ్చల్, వందన గుప్తా జంటగా కలర్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కిషోర్ కంటమనేని సమర్పణలో ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం 'తులసీదళం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

ప్రేమకు హారర్ సమస్య అయితే..

హారర్ సినిమా అంటే అందరు రాత్రి పూట ఎక్కువగా సినిమా షూట్ చేస్తారు. కాని ఈ సినిమాను ప్రపంచంలోకెల్లా అత్యధిక వెలుతురు గల లాస్ వేగాస్ ప్రాంతంలో 44రోజుల పాటు చిత్రీకరించాం. ప్రతి ప్రేమకు ఒక సమస్య ఉంటుంది. హారర్ అనేది ప్రేమకు సమస్య అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా చేశాం.

ఇదొక మ్యూజికల్ ఫిలిం..

ఈ మధ్య నన్ను కలిసిన వారందరూ మీ మ్యూజిక్ చాలా మిస్ అవుతున్నామని చెబుతున్నారు. కాని ఈ సినిమా చూస్తే వాళ్ళందరికీ ఆ ఫీల్ పోతుంది. ఇదొక మ్యూజికల్ ఫిలిం అని చెప్పొచ్చు.

అందుకే లేట్ అయింది..

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే నిర్మాతగా నాకు సినిమా పట్ల అవగాహన రావడానికి కాస్త సమయం పట్టింది. అందుకే సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇంత గొప్ప పాయింట్ ఎవరూ చెప్పలేదు..

తులసి దేవుడికి సమానంగా సరితూగగలిగేది. అంత గొప్ప టైటిల్ మా సినిమాకు ఎందుకు పెట్టుకున్నానో సినిమా చూస్తే అర్ధమవుతుంది. మా సినిమాకు అయితే ఈ టైటిల్ యాప్ట్ అని భావించాం. హారర్ కథల్లో ఇంత గొప్ప పాయింట్ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.

ప్రయోగంలా చేశాను..

ఈ సినిమా మొత్తం షూటింగ్ ఫారెన్ లో చేసినా.. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. ఇండియన్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ సినిమాలో ఉంటాయి. లాస్ వేగాస్ లాంటి బ్రైటెస్ట్ ప్రాంతంలో షూట్ చేస్తే ఎలా ఉంటుందో.. చిన్న ప్రయోగంలా ఈ సినిమా చేశాను.

అలాంటి సినిమాలకు మ్యూజిక్ చేయాలనుంది..

నటుడిగా మారాలని అనుకోలేదు. నిజంగానే నేను నటించాలనుకుంటే వరుసగా సినిమాల్లో నటిస్తూ.. ఉండేవాడిని కదా.. కాని నేను చేయగలను అనుకున్న సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాను. అలానే మ్యూజిక్ కూడా చేయనని చెప్పట్లేదు. నన్ను మ్యూజిక్ చేయమని ఎవరడిగినా చేస్తాను. మనం, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు లాంటి సినిమాలకు మ్యూజిక్ చేయాలనుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

'మనలో ఒకడు' షూటింగ్ జరుగుతోంది. జర్నలిజానికి సంబంధించిన కథ. హీరో కామన్ మ్యాన్ అయ్యి మీడియా తన చుట్టూ తిరిగితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాను. తెలుగు, కన్నడ బాషలలో చిత్రాన్ని రూపొందిస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement