కోలీవుడ్‌లో వివాదాల రాజా ఎవరంటే ఎవరైనా సరే ఠక్కున శింబు పేరే చెబుతారు. కాగా ఆయనకు ప్రస్తుతం పెద్దగా హిట్స్‌లేకపోవడంతో ఆయన క్రేజ్ బాగా తగ్గింది. దీంతో ఆయన ఓ ట్రిక్ ప్లే చేసి తన సినిమాలకు క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు. గతంలో తాను గొడవపడిన వారిని, తాను ప్రేమాయణం నడిపి విడిపోయిన వారికి అవకాశాలు ఇస్తూన్నాడు. ప్రస్తుతం ఆయన 'ఇదు నమ్మఆలు' చిత్రంలో తన మాజీ ప్రేయసి నయనతారతో కలిసి నటిస్తున్నాడు. ఈ జోడీ మరలా జతకడుతూ ఉండటంతో ఈ చిత్రంపై మంచి క్రేజే ఏర్పడింది. ఇక 'వాలు' చిత్రంలో తన మరో మాజీ ప్రేయసి హన్సికతో నటిస్తున్నాడు. తాజాగా యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రంలో మరోసారి హన్సికను ఎంపిక చేసుకున్నాడు. ఆయా హీరోయిన్లు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనతో నటించాల్సిందే అనే పట్టుదలతో దర్శకనిర్మాతల చేత భారీ రెమ్యూనరేషన్లు ఆఫర్ చేయిస్తున్నాడు. తన కెరీర్ మరలా గాడిలో పడాలంటే వీరే తనకు దిక్కుని డిసైడ్ అయ్యాడని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. మొత్తానికి శింబు వరుస చూస్తే ఆయన ప్లే చేస్తున్న ట్రిక్ బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది.