Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ:మల్కాపురం శివకుమార్

Thu 25th Feb 2016 11:44 PM
malkapuram sivakumar interview,dasarath,shourya movie,manchu manoj  సినీజోష్ ఇంటర్వ్యూ:మల్కాపురం శివకుమార్
సినీజోష్ ఇంటర్వ్యూ:మల్కాపురం శివకుమార్
Advertisement

మంచు మనోజ్ రెజీనా జంటగా బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ విలేకర్లతో ముచ్చటించారు.

కథ నచ్చి ట్రావెల్ చేశాం..

దసరథ్ ఈ సినిమా స్టొరీ చెప్పినప్పటి నుండి తనతో ట్రావెల్ చేస్తున్నాను. తనకు ఇప్పటివరకు సాఫ్ట్ డైరెక్టర్ అని పేరుంది. ఎవరు దేనికి పరిమితం కాదు. అలానే దసరథ్ కూడా ఏ సినిమా అయిన డైరెక్ట్ చేయగలిగే సత్తా ఉన్నదర్శకుడు. ఏ టెక్నీషియన్ తెలిసి తెలిసి తప్పు చేయడు. తనకు అవకాశం లభిస్తే ఏ జోనర్ లో అయినా సినిమా చేయగలరు.

మొత్తం సెలెక్షన్ అంతా నాదే..

నా సినిమాలో ఉండే జూనియర్ ఆర్టిస్ నుండి హీరో వరకు మొత్తం సెలెక్షన్ అంతా నేనే చేస్తాను. ఈ సినిమాలో పాత్రకు తగ్గ ఆర్టిస్ట్ ను టెక్నీషియన్ ను ఎంపిక చేసి సినిమాను మొదలుపెట్టాను.

కొత్త వాళ్ళను పరిచయం చేయడం నా హాబీ..

ఇదివరకు మా బ్యానర్ లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ను పరిచయం చేశాం. ఈ సినిమా ద్వారా మరో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నాడు. నా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమా ద్వారా కొత్త వాళ్ళను పరిచయం చేయడం నా హాబీ. 

మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది..

నేను క్వాలిటీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. మొదట వేదా ఇచ్చిన ట్యూన్స్ విని నచ్చిన తరువాతే తనను ఎంపిక చేసుకున్నాను. వేదా కు ఇది మొదటి సినిమా అయినా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కథే సినిమాకు హైలైట్..

ఇదొక లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఈ అంశాలతో పాటు ఓ క్రైమ్ థీమ్ సినిమా అంతా ట్రావెల్ అవుతూ ఉంటుంది. కథే సినిమాకు పెద్ద హైలైట్. సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. అలానే వేదా మ్యూజిక్ మరో హైలైట్ అవుతుంది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కే చెందుతుంది. ఇదొక దర్శకుని సినిమా అని చెప్పొచు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కథకు ప్రాణం.

మనోజ్ మంచి నటుడు..

మొదటిసారిగా ఈ సినిమాలో మనోజ్ సాఫ్ట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఏ ఆర్టిస్ట్ అయినా ఒకటే పాత్రకు పరినితం అవ్వకూడదు. తనను ఎలాగైనా మౌల్ద్ చేసుకోవచ్చు. కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కు మనోజ్ బాగా రీచ్ అవుతాడు. పెళ్ళికి ముందు మనోజ్ అన్ని మాస్ రోల్స్ చేశాడు.. పెళ్లైంది కదా అందుకే క్లాస్ గా మారిపోయాడు(నవ్వుతూ..). 

ప్రొడ్యూసర్ గా అన్ని తెలిసి ఉండాలి..

ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు క్యాషియర్స్ గా మారిపోతున్నారు. మన చేతిలో పవర్ ఉంటేనే ఏదైనా చేయగలం. చేసే పని మీద అవగాహన లేకపోతే అవుట్ పుట్ సరిగ్గా రాదు. ప్రొడక్షన్ హౌస్ కి నిర్మాతే బాస్. తప్పు జరిగినా.. ఒప్పు జరిగినా తనదే బాధ్యత. 

1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం..

ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో కలిపి 700 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఓవర్సీస్ లో 300 థియేటర్లలో ప్లాన్ చేస్తున్నాం. మొత్తం సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. సినిమా బిజినెస్ మొత్త పూర్తయింది.

కొత్త వారికి అవకాశాలు ఇస్తాను..

కథలు చెప్పడానికి చాలా మంది దర్శకులు వస్తుంటారు. వాళ్ళు ఇంతకముందు ఎక్కడ పని చేశారు..? బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? అనే విషయాలను అసలు పట్టించుకోను. నాకు కథ నచ్చితే చాలు. పని చేయాలనే తపన దర్సకుడిలో ఉండాలి. టెక్నికల్ వర్క్ మీద గ్రిప్ ఉండాలి. అయినా చూడగానే తను పని చేయగలడా..? లేదా అనే విషయం నాకు అర్ధమవుతుంది. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

రెండు స్క్రిప్ట్స్ ఫైనల్ చేశాను. ఏప్రిల్ 8 న కొత్త సినిమాను ప్రారంభించనున్నాం అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement