Advertisementt

మహేష్‌,ఎన్టీఆర్‌ల రికార్డుపై కన్నేసిన నాని..!

Thu 25th Feb 2016 11:54 PM
nani,ntr,mahesh babu,krishnagadi veeraprema gadha  మహేష్‌,ఎన్టీఆర్‌ల రికార్డుపై కన్నేసిన నాని..!
మహేష్‌,ఎన్టీఆర్‌ల రికార్డుపై కన్నేసిన నాని..!
Advertisement
Ads by CJ

నాని ఓ సైలెంట్‌ కిల్లర్‌గా మారిపోయాడు. కుర్రహీరోలలో నాని రేంజ్‌ మారిపోయింది. కాగా ఆయన తాజాగా ఓ రికార్డుపై కన్నేశాడు. ఏకంగా మహేష్‌, ఎన్టీఆర్‌ల రికార్డులపై ఆయన కన్ను పడింది. ఓవర్‌సీస్‌లో ఈమధ్య నాని దూసుకెళ్లుతున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమగాథ' కూడా ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఇప్పటికే నాని 'ఈగ, భలే భలే మగాడివోయ్‌' వంటి రెండు చిత్రాలతో మిలియన్‌ డాలర్ల హీరోగా అవతరించాడు. తాజాగా 'కృష్ణగాడి వీరప్రేమగాథ' చిత్రంతో ఆ సంఖ్యను మూడుకు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు నాని. ఇప్పటికే ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో 5కోట్ల మార్క్‌ను అందుకొంది. మరో కోటి 50లక్షలు వసూలు చేస్తే చాలు.... నాని కెరీర్‌లో మూడో మిలియన్‌ డాలర్ల సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ ఫీట్‌ మహేష్‌, ఎన్టీఆర్‌లకే సాధ్యం అయింది. మరి నాని ఆ ఫీట్‌ను సాదిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ