Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ-లావణ్య త్రిపాఠి

Fri 08th Jan 2016 08:15 AM
lavanya tripathi intervie,soggade chinninayana,kalyan krishna,nagarjuna  సినీజోష్ ఇంటర్వ్యూ-లావణ్య త్రిపాఠి
సినీజోష్ ఇంటర్వ్యూ-లావణ్య త్రిపాఠి
Advertisement

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి లావణ్య త్రిపాఠి. 'దూసుకెళ్తా','భలే భలే మగాడివోయ్' చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో సినీజోష్ ఇంటర్వ్యూ..

సంప్రదాయకంగా కనిపిస్తా..

'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాలో సంప్రదాయకంగా కనిపిస్తాను. అమ్మయిలు చీరల్లో చాలా అందంగా కనిపిస్తారు. సినిమా మొదలయినప్పటినుండి చివరి వరకు నేను చీరల్లోనే కనిపిస్తాను. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. అందుకే సెలక్ట్ చేసుకున్నాను. రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి.

చాలెంజింగ్ అనిపించింది..

నాగార్జున గారితో సినిమా అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. టాలీవుడ్ స్టార్ హీరోతో కలిసి నటించడానికి చాలెంజింగ్ గా అనిపించింది. సినిమాలో నా బెట్ ఇవ్వాలనుకున్నాను. ఆ విషయంలో నాగార్జున గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు. సెట్స్ లో నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేశారు. సినిమా జర్నీ అంతా చాలా కూల్ గా అయింది. 

ఇద్దరి ఆలోచనా విధానం వేరు..

ఈ సినిమాలో నాగార్జున గారు బంగార్రాజు, రాము అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. బంగార్రాజు అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తూ.. అమ్మాయిలతోనే ఎక్కువగా ఉంటాడు. రాము వచ్చేసరికి అసలు అమ్మాయిల జోలికే వెళ్ళడు. తన సొంత భార్యకు తన ప్రేమను వ్యక్తం చేయలేని సిగ్గరి. 

నాకు ఇద్దరి వ్యక్తిత్వం కలిసి ఉండాలి..

నాకు భర్తగా వచ్చే మనిషిలో బంగార్రాజు, రాము ఇద్దరి ఆలోచనలు కలిసి ఉండే వ్యక్తి కావాలి. నాతో నిజాయితీగా ఉండాలి.  

ఆమె నాకు మంచి ఫ్రెండ్..

రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటితో కలిసి పని చేశాను. ఆమె చాలా ఓపెన్ గా ఉండే మనిషి. ఫ్యాబులస్ యాక్టర్. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఇద్దరం ఫ్రెండ్స్ లాగా కలిసి వర్క్ చేసేవాళ్ళం. ఎన్నో విషయాల్లో నాకు హెల్ప్ చేసేవారు.

కొత్త డైరెక్టర్ గా అనిపించలేదు..

కళ్యాన్ కృష్ణ గారు కొత్త డైరెక్టర్ అని నాకు అనిపించలేదు. సెట్స్ లో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. తనకు ఏం కావాలనే విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు. 

ఐరన్ లెగ్ అనిపించుకోవాలని లేదు..

సినిమా సక్సెస్ అయితే హీరో, హీరోయిన్లు ఇద్దరికి మంచి పేరు వస్తుంది. అదే ఫెయిల్ అయితే ఈ అమ్మాయి ఐరన్ లెగ్ అంటుంటారు. నాకు అలా అనిపించుకోవాలని లేదు. అందుకే గ్యాప్ తీసుకొని మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాను. మహేష్ బాబు, పవన్ కళ్యాన్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమా అంటే వెంటనే ఒప్పేసుకోవచ్చు. అదే కొత్త వాళ్ళతో అంటే పాత్ర, కథ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మూడు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.. 

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' సినిమాలో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను. అంకాలమ్మ అనే పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. అందులో అందరిని భయపెట్టే ఒక పాట ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. క్రైమ్, కామెడీ నేపధ్యంలో సాగే కథ.

శిరీష్ సినిమాలో నటిస్తున్నా..

అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాను. అందులో కాలేజీకు వెళ్ళే అమ్మాయి పాత్ర. డిఫరెంట్ రోల్ అని చెప్పలేను కాని నేను డిఫరెంట్ గా చేయడానికి ప్రయత్నించాను. చాలా న్యాచురల్ గా ఉంటుంది. సిటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. డైరెక్టర్ కూడా బాగా డైరెక్ట్ చేస్తున్నాడు.

కొత్త సినిమా ఓకే చేశాను.. 

కొత్త డైరెక్టర్ ఒకరు చెప్పిన స్టొరీ బాగా నచ్చింది. డిఫరెంట్ క్యారెక్టర్. రెగ్యులర్ గా ఉండే సినిమా కాదు. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న సినిమా అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement