Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ- రకుల్ ప్రీత్ సింగ్

Mon 18th May 2015 08:57 AM
rakul preeth singh,pandaga chesko,gopichand malineni,sonal chowhan  సినీజోష్ ఇంటర్వ్యూ- రకుల్ ప్రీత్ సింగ్
సినీజోష్ ఇంటర్వ్యూ- రకుల్ ప్రీత్ సింగ్
Advertisement

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నిర్మాత పరుచూరి కిరీటి యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘పండగ చేస్కో’. చాలా కాలంగా సెట్స్‌పైనే ఉన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు విడుద‌ల తేదీని ఖ‌రారు చేసుకొని ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

ఈ సినిమా ఎలా ఉండబోతోంది..?

ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, మ్యూజిక్ తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. మంచి ఎమోషనల్ మసాలా మూవీ ఇది. ఫ్యామిలీ కు దూరంగా ఉన్నవారు ఈ సినిమా చుసిన తరువాత దగ్గరగా ఉండాలనే ఫీలింగ్ కలుగుతుంది.

మీ పాత్ర గురించి..?

ఈ సినిమాలో నేను దివ్య అనే పాత్రలో కనిపిస్తాను. తనొక ప్రకృతి ప్రేమికురాలు. ఈ క్యారెక్టర్స్ ఉన్న సినిమాలు తెలుగులో ఇప్పటివరకు రాలేదు. సినిమాలో గ్రీనరి అంటే నాకు చాలా ఇష్టం. ఎవరైనా ఒక చెట్టు కొమ్మను విరిచినా కాని గొడవ పెట్టేసుకుంటాను. నేను నటిస్తున్నప్పుడు నాకు కామెడీ అనిపించలేదు కాని సినిమాలో నా క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం ప్రేక్షకులకు నవ్వొస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ అది. 

మీ కో యాక్టర్స్ రామ్, సోనాల్ చౌహాన్ గురించి..?

రామ్ చాలా మంచి డాన్సర్. తనతో డాన్స్ చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం బయపడ్డాను. కాని ఏదో మేనేజ్ చేసేసాను. సోనాల్ తో నాకు రెండు మూడు సీన్స్ మాత్రమే ఉంటాయి. స్వీట్ గర్ల్ తను. 

దర్శకుడు గోపీచంద్ మలినేనితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

డైరెక్టర్ గారికి తనకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో బాగా తెలుసు. క్లాస్ ఆడియన్స్ కు, మాస్ ఆడియన్స్ కు ఎలా చేస్తే సినిమా నచ్చుతుందో, రెండింటిని ఎలా బాలెన్స్ చేయాలో ఆయనకీ తెలుసు. ఒక్కొక్క ఫ్రేమ్ లో 20 నుండి 25 మంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరిని మేనేజ్ చేస్తూ తనకు కావలసినట్లుగా ఔట్ పుట్ రప్పించుకుంటారు. చాలా ఓర్పు ఉన్న మనిషి. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.

స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు..?

కథ విన్నప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రా లేదా అని చూస్తాను. రెండు స్క్రిప్ట్స్ నా చేతిలో ఉంటే ఏ సినిమాలో నా పాత్రకు పెర్ఫార్మన్స్ ఎక్కువగా ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకుంటాను. అనవసరంగా మూవీలో గ్లామరస్ గా నటించడం నాకు నచ్చదు. సీన్స్ డిమాండ్ చేస్తే మాత్రమే నటిస్తాను. అయినా గ్లామర్ అనేది మనం వేసుకున్న డ్రెస్ లలో ఉండదు. పాత్రకు తగ్గట్లుగానే వస్త్రధారణ ఉంటుంది. 

అతి తక్కువ సమయంలోనే మీకు స్టార్ హీరోస్ తో నటించే అవకాశాలు వస్తున్నాయి. దాని వెనుక మీ సీక్రెట్ ఏంటి..?

సీక్రెట్ అంటూ ఏమి లేదు. అన్ని కరెక్ట్ గా కుదిరాయి. హార్డ్ వర్క్ చేస్తే అందరికి అవకాశాలు వస్తాయి. 

ఫ్యామిలీ లైఫ్ ను మిస్ అవ్వట్లేదా..?

నాకు ఇష్టమైన పని చేసుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్యామిలీ లైఫ్ ను మిస్ అవ్వట్లేదు. మా అమ్మ నాతోనే ఉంటుంది. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ తో రెండు, మూడు రోజులకొకసారి మాట్లాడుతూ ఉంటాను. నాకు వీలున్నప్పుడల్లా డిల్లీ వెళ్లి వారిని కలుస్తాను.

నిజ జీవితంలో మీకు ఇష్టమైన పండగ ఏంటి..?

హొలీ అంటే నాకు చాలా ఇష్టం. కాని ఇప్పుడు ఆడలేను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలలో నటించడానికి సైన్ చేసాను. బాలీవుడ్ లో నేను నటించిన సినిమా 'షిమ్లా మిర్చి' ఆగష్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement