Advertisementt

లీకేజీ రాయుళ్లతో తలలు పట్టుకుంటున్న హీరోలు!

Mon 18th May 2015 10:17 AM
ram charan,balakrishna,mahesh babu,fake titiles   లీకేజీ రాయుళ్లతో తలలు పట్టుకుంటున్న హీరోలు!
లీకేజీ రాయుళ్లతో తలలు పట్టుకుంటున్న హీరోలు!
Advertisement
Ads by CJ

లీకేజీ రాయుళ్లు హీరోలనే కాదు.. దర్శకనిర్మాతలకు కూడా పెద్ద తలనొప్పిగా మారారు. ఓ స్టార్‌హీరో చిత్రం మొదలైదంటే చాలు.. వెంటనే ఈ లీకేజీ వీరులు ఇదే టైటిల్‌ అంటూ తామూహించుకునే కొన్ని టైటిల్స్‌ను ప్రచారంలోకి తీసుకొస్తుంటారు. దీంతో ప్రతి దానిని ఖండించలేక యూనిట్‌ అంతా తలలు పట్టుకొంటున్నారు. ఇలా రోజు ఇండస్ట్రీలో అనేక ఫేక్‌ టైటిల్స్‌ ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఇక్కడ మన హీరోలు, దర్శకులు చేసే కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. ఓ టైటిల్‌ను యూనిట్‌ అనుకొని దాన్ని గుట్టుచప్పుడు కాకుండా లీక్‌ చేసి ఆ టైటిల్‌కు వచ్చే రెస్పాన్స్‌ను గమనించి టైటిల్‌ ఫైనల్‌ చేయాలనుకోవడం ఈ టెక్నిక్‌కు బాగా ఆజ్యం పోస్తోంది. ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది.దీనికి ‘చంద్రుడు, శ్రీమంతుడు, నా అక్క బంగారం’ వంటి టైటిల్స్‌ ప్రచారంలోకి తెచ్చారు. ఇప్పుడు దీనికి ‘మగాడు’ అనే టైటిల్‌ ఖాయమైందంటూ వార్తలు వస్తున్నాయి.
ఇక బాలకృష్ణ నటించనున్న 99వ చిత్రానికి ‘డిక్టేటర్‌’అని, 100వ చిత్రానికి ‘చరిత్రకు ఒక్కడు’అని టైటిల్స్‌ పుట్టుకొచ్చాయి. ఇక రామ్‌చరణ్‌-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘మై నేమ్‌ ఈజ్‌ రాజు’ అని ప్రచారం జరిగింది. లేటెస్ట్‌గా ఈ చిత్రానికి ‘బ్రూస్లీ’ అనే టైటిల్‌ అంటున్నారు. సో.. దీనివల్ల ఓ లాభం కూడా ఉంది. పది టైటిల్స్‌ ప్రచారంలోకి రావడం వల్ల చిన్న చిత్రాల హీరోలకు, దర్శకులు, నిర్మాతలకు మిగిలిన తొమ్మిది టైటిల్స్‌ చాయిస్‌గా లభిస్తున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ