Advertisement

మాజీ హోంమంత్రి తనయుడి అరెస్టు..!!

Sat 25th Apr 2015 02:10 AM
tdp dharna,veerendra goud,trs,tdp,mla,jump  మాజీ హోంమంత్రి తనయుడి అరెస్టు..!!
మాజీ హోంమంత్రి తనయుడి అరెస్టు..!!
Advertisement

చంద్రబాబు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్నారు. ఇబహ్రీంపట్నం ఎమ్మెల్యే, టీడీపీ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శుక్రవారం క్యాంప్‌ ఆఫీసులో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో ఇప్పటి వరకు టీడీపీ నుంచి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినట్లైంది. అంతేకాకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలుపుకుంటే టీఆర్‌ఎస్‌ బలం 75 ఎమ్మెల్యేలకు చేరుకుంది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 స్థానాలను గెలుచుకోగా కాంగ్రెస్‌నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను కలుపుకొని మొత్తం 12 మంది ఆ పార్టీలోకి వలసవెళ్లారు. దీంతో ఆ పార్టీ బలం 75కు చేరుకుంది.

 

మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీని ఇరుకున పెట్టడానికి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్లముందు తెలుగుతమ్ముళ్లు ధర్నాకు దిగారు. మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల ఇళ్ల ఎదుట మాజీ హోంమంత్రి తనయుడు వీరేంద్రగౌడ్‌ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారి ఇళ్లకు వీరేంద్రగౌడ్‌ ర్యాలీగా వెళుతుండగా సరూర్‌నగర్‌ వద్ద పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement