Advertisementt

హాట్‌టాపిక్‌గా బెల్లంకొండ ఇంటిపై దాడి..!!

Sat 25th Apr 2015 03:45 AM
bellamkonda suresh,accident,house,attack  హాట్‌టాపిక్‌గా బెల్లంకొండ ఇంటిపై దాడి..!!
హాట్‌టాపిక్‌గా బెల్లంకొండ ఇంటిపై దాడి..!!
Advertisement
Ads by CJ

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ ఇంటిపై దాడి జరగడం ఇండస్ట్రీల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బెల్లంకొండ సురేష్‌కు చెందిన కారు శుక్రవారం మధ్యాహ్నం ఫిల్మ్‌నగర్‌లోని రోడ్డు నం.7లో ఓ యువకుడితోపాటు మరికొందర్ని ఢికొట్టింది. ఆ తర్వాత కారు ఆపకుండా డ్రైవర్‌ అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడ్డవారిని స్థానికులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడి బంధువులు బెల్లంకొండ సురేష్‌ ఇంటిపై దాడి చేశారు. ఇంటి అద్దాలు పగులగొట్టడంతోపాటు పూలకుండీలు ధ్వంసంచేసి కారు అద్దాలు కూడా పగులగొట్టారు. దాడిని అడ్డుకోబోయిన బెల్లంకొండపై కూడా వారు దాడి చేసినట్లు సమాచారం. దీంతో బెల్లంకొండ సురేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక యాక్సిడెంట్‌కు కారణమైన కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం. మరి ప్రమాదం జరిగినప్పుడు డ్రైవరే కారు నడుపుతున్నాడా..? లేక డ్రైవింగ్‌ సీట్లో వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా..? అనేది కూడా అనుమానంగానే ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ