తిరుపతిలో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!!

Tue 21st Apr 2015 01:09 AM
jb patnaik,odisha cm,died,assoam governer  తిరుపతిలో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!!
తిరుపతిలో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత..!!
Sponsored links

ఒడిషా మాజీ ముఖ్యమంత్రి జెబీ పట్నాయక్‌ మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆయన మూడు పర్యాయాలు ఒడిషాకు ముఖ్యమంత్రిగా, ఓసారి అస్సాంకు గవర్నర్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జేబీ పట్నాయక్‌ జనవరి 3, 1927లో జన్నించారు. యువకుడిగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున 1980నుంచి 1989 వరకు , 1995 నుంచి 1999 వరకు కూడా ఒడిషాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009 నుంచి 2014 వరకు అస్సోంకు గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాగా తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృతి విద్యాపీఠ్‌లోని ఓ సదస్సులో హాజరుకావడానికి ఆయన సోమవారం భువనేశ్వర్‌నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఇక అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి  రావడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జేబీ పట్నాయక్‌ కన్నుమూశారు. మంగళవారం ప్రత్యేక విమానంలో జేబీ పట్నాయక్‌ను భువనేశ్వర్‌ తరలించనున్నారు. నవీన్‌ పట్నాయక్‌ తర్వాత సుదీర్ఘకాలం ఒడిషాకు ముఖ్యమంత్రిగా జేబీ పట్నాయక్‌ పనిచేశారు. జేబీ పట్నాయక్‌కు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019