Advertisementt

రానాకు 'పెటా' ఇచ్చిన బహుమతులెంటి..??

Tue 21st Apr 2015 01:02 AM
rana,vegeterian,peta  రానాకు 'పెటా' ఇచ్చిన బహుమతులెంటి..??
రానాకు 'పెటా' ఇచ్చిన బహుమతులెంటి..??
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో రోజురోజుకూ శాఖహారుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ లిస్టులో తాజాగా రానా కూడా వచ్చి చేరాడు. తాను పూర్తిగా మాంసాహారాన్ని మానివేశానని, శాఖహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు ఈ కుర్రహీరో ఇప్పటికే ప్రకటించాడు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన 'పెటా' రానాకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్‌ పంపింది. అంతేకాకుండా ఆయనకు పూలు, చాక్లెట్లు, బిస్కెట్లను కూడా కొరియర్‌ ద్వారా బహుమతిగా పంపినట్లు స్వయంగా రానా ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ఇక రానా నటించిన 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలు ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతున్నాయి. 'బాహుబలి'లో ప్రతినాయకుడి పాత్రలో రానా నటనను చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే 'బాహుబలి'లోని ఓ పోస్టర్‌లో రానా గదె పట్టుకు ఉన్న చిత్రాన్ని ట్విట్టర్‌లో పెట్టాడు. దీనికి లైక్‌ల వర్షం కురుస్తోంది. 

Tags:   RANA, VEGETERIAN, PETA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ