Advertisement

నాడు ఎమ్మెస్‌ - నేడు జేసీ దివాకర్‌ రెడ్డి!

Fri 03rd Apr 2015 09:24 AM
jc diwakar reddy,2004,ms satyanarayana rao,jayaprakash narayan,kadapa,ysrcp  నాడు ఎమ్మెస్‌ - నేడు జేసీ దివాకర్‌ రెడ్డి!
నాడు ఎమ్మెస్‌ - నేడు జేసీ దివాకర్‌ రెడ్డి!
Advertisement

2004లో కాంగ్రెసు - టిఆర్‌ఎస్‌ మధ్య సంబంధాలు సున్నితమయినవి, భావోద్వేగాలతో కూడుకున్నవి. పిసిసి అధ్యక్షుడుగా తెలంగాణ కాంగ్రెసు నాయకుడు ఎమ్మెస్‌ సత్యనారాయణరావు. ఇందిరాగాంధీ నుంచి చంద్రబాబు, కెసిఆర్‌ వరకు ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేవారు. పార్లమెంటు సభ్యుడుగా కేంద్రమంత్రిగా కెసిఆర్‌ ఎంపిక కావడంతో టిఆర్‌ఎస్‌ - తెలంగాణ ఉద్యమం చల్లబడిరది. ఆ స్థితిలో కెసిఆర్‌ ఎంపిగా రాజీనామాచేసి పోటీచేస్తే ఓడిపోతారని, కెసిఆర్‌ పై పోటీకి తాను సిద్ధమని సవాలు విసిరారు ఎమ్మెస్‌. ఆ సవాలుని స్వీకరించి రాజీనామా చేసి పోటీకి దిగారు కెసిఆర్‌. ప్రత్యర్ధి జీవన్‌ రెడ్డి. కెసిఆర్‌ ఓడితే తెలంగాణవాదం ఓడిపోతుందని తెలంగాణ వాదులంతా కెసిఆర్‌కి బాసటగా నిలిచారు. ఉద్యమం సజీవంగా వుండాలంటే ఉప ఎన్నికలే శరణ్యమని భావించిన కెసిఆర్‌ పంధా మార్చారు, తెలంగాణ సాధించారు. ఇప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి, అనంతపూరు జిల్లా టిడిపి ఎంపీ. కాంగ్రెసు నుంచి వచ్చిన ఈ మేధావి కామెంట్స్‌ బిజెపి - టిడిపి సంబంధాలను దెబ్బతీసేలా వుండటమేకాదు కడపలో నీటి తగాదా ముంచుకొచ్చేలా వుంది. అదే జరిగితే వైయస్సార్‌సీపీకి శాశ్వతంగా కడపజిల్లాని వదిలేసుకోవడమే అవుతుంది.

జేపీ అనబడు ‘లోక్‌సత్తా’ జాతీయ నాయకుడు జయప్రకాష్‌ నారాయణని చూడండి ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సభ్యుడూలేని ఈ జాతీయ పార్టీ నాయకుడు ఆంధ్రా తెలంగాణ గురించి మాట్లాడరు, కేంద్రం గురించే జాగ్రత్తగా మాట్లాడతారు. జేపీని చూసి జేసీ ఏం నేర్పుకుంటారో!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement