Advertisementt

డైనమైట్‌ అనంతరం మంచు విష్ణు మూవీ ఇదే!

Fri 03rd Apr 2015 09:21 AM
manchu vishnu,dynamite,mupparaju hanuman,ravibabu director,rajkumar m producer,dev katta  డైనమైట్‌ అనంతరం మంచు విష్ణు మూవీ ఇదే!
డైనమైట్‌ అనంతరం మంచు విష్ణు మూవీ ఇదే!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దేవ కట్ట దర్శకత్వంలో ‘డైనమైట్‌’ చిత్రంలో నటిస్తూ బిజీ ఉన్న మంచు విష్ణు తన తదుపరి చిత్రం గురించిన వివరాలు వెల్లడిరచారు. ఆర్‌.కె.స్టూడియోస్‌ పతాకంపై రాజ్‌కుమార్‌.ఎం నిర్మాతగా యువ దర్శకుడు ముప్పరాజు హనుమాన్‌ డైరెక్షన్‌లో తన నెక్ట్స్‌ మూవీ అతి త్వరలో స్టార్ట్‌ అవుతుందని తెలిపారు.

ప్రముఖ దర్శకులు రవిబాబు వద్ద శిష్యరికం చేసిన హనుమాన్‌` ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విష్ణు సరసన నటించేందుకు ఓ టాప్‌ హీరోయిన్‌ని ఎంపిక చేయనున్నారు. 

చిత్ర దర్శకుడు ముప్పరాజు హనుమాన్‌ మాట్లాడుతూ... ‘ఒక మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాను. మంచు విష్ణు ఈ కథను సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకె చేశారు. ఆయన ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. నేటి సమాజంలోని ఒక తీవ్రమైన సమస్యకు ఈ చిత్రంలో సమాధానం చెప్పనున్నాం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి` ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అన్నారు!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ