Advertisement

చదువులపై పేరెంట్స్ స్పందించాల్సిన సమయమిదే !

Wed 07th Jan 2015 04:02 AM
eamcet,inter,telangana,andhra pradesh,students  చదువులపై పేరెంట్స్ స్పందించాల్సిన సమయమిదే !
చదువులపై పేరెంట్స్ స్పందించాల్సిన సమయమిదే !
Advertisement

'ఎంసెట్-' సరే; ఇంటర్ పరిక్షల్లోనే అన్యాయం జరుగుతోంది!

ఇంటర్ విద్యార్దుల తల్లిదండ్రులు స్పందించాల్సిన సమయమిది!!

ఎంసెట్ మెడికల్ స్ట్రీమ్ లో పోటీ ఎక్కువ! ఒక్క మార్కు తేడాతో సీట్ చేజారిన సంఘటనలెన్నో. ఇంటర్ మార్కు లకి వెయిటేజీ ఇస్తున్న నేపధ్యంలో - తెలంగాణ , ఆంధ్ర వేర్వేరుగా ఇంటర్ పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదు. ఇరు రాష్ట్రాల విద్యార్ధులు ఒకే క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయాలి. 

'ఇంటర్ పరీక్షలు' - ఆంధ్ర, తెలంగాణ వేర్వేరుగా! 

'ఎంసెట్' - కామన్ గా; అయితే ఈ కామన్ పరీక్షని ఎవరు నిర్వహించాలన్నది వివాదం. 

అసలు సమస్య ఇంటర్ పరీక్షలతో ముడిపడివుంది. ఎంసెట్ - బై పి సి : ఒక మార్కు తేడాతో మారే ర్యాంకులు; నలుగురయిదురికి ఒకే ర్యాంకు - అంటే  పోటీ పరీక్ష తీవ్రత ఎంతగా వుంటుందో ఊహించవచ్చు. 

మెడికల్ సీట్ కి అర్హత - ఈ ఎంసెట్ : ఇంటర్ పరీక్షలలో (ఐపిఇ ) వచ్చిన మార్కులకి వెయిటేజీ : 25 శాతం ఇంటర్ మార్కులకు - 75 శాతం ఎంసెట్ కి! అంటే మెడికల్ సీటుని  నిర్ధారించే ఈ పోటీ పరీక్షలలో ఇంటర్ మార్కుల ప్రాధాన్యతని ఊహించ వచ్చు. తెలంగాణ - ఆంధ్రా ఉమ్మడి పరీక్ష : ఇంటర్ పరీక్షలు విడివిడిగా: బహిరంగంగా ఒప్పుకోకపోవచ్చు, ఎవరికి వారు తమ పిల్లలకే ఎక్కువ మెడికల్ సీట్లు రావాలన్న తాపత్రయం వుండితీరుతుంది. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలలో అవకతవకలు జరుగుతాయని, జంబ్లింగ్ విధానం ప్రవేశ పెట్టండన్న డిమాండ్ వుంది. ఈ నేపధ్యంలో పరీక్ష పేపర్ స్టాండర్డు - పరీక్షా కేంద్రాల వద్ద విజిలెన్స్ ఫై సందేహాలు వుండటం సహజం. ఇంటర్ పరీక్షలు ఆంధ్రా - తెలంగాణకి వేర్వేరుగా అనుమతించడంతోనే ఓ వివాదానికి  బీజంపడింది. రేపు ఆంధ్రా నిర్వహించే ఎంసెట్ కి తెలంగాణ విద్యార్ధులు ఎక్కడ పరీక్ష రాయాలి?  తెలంగాణ నిర్వహించే ఎంసెట్ కి ఆంధ్రా విద్యార్ధులు ఎక్కడ పరీక్ష రాయాలి? ఈ పరీక్షలు నిజాయితీగా జరుగుతాయా? పిల్లల భవిష్యత్తుని రాజకీయ సమీకరణాలతో ముడిపెట్టడం సమంజసమా? 

ఇంటర్ పరీక్షలు వేర్వేరుగా జరపడానికి అంగీకరించడమే పెద్ద పొరపాటు. తల్లితండ్రులు స్పందించకపోవడం గ్రహపాటు. 

 

                                                                  తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement