Advertisement

పాత్రో జన్మజన్మల ఫిలాసఫీ..!!

Wed 07th Jan 2015 03:44 AM
  పాత్రో జన్మజన్మల ఫిలాసఫీ..!!
పాత్రో జన్మజన్మల ఫిలాసఫీ..!!
Advertisement

>ఆఖరి సినిమా ఆఖరి సన్నివేశంలో పాత్రో  అలా  రాయటం  దైవ  సంకల్పం

1978 -విశాఖలో  'మరో  చరిత్ర ' నిర్మాణం  : నవయుగ ఫిలిమ్స్ కాట్రగడ్డ నరసయ్య గారు విజయవాడ నుంచి పాత్రికేయులను తీసికెళ్లారు . బాలచందర్ - కమలహాసన్ - సరిత - గణేష్ పాత్రోలను కలిసే మహదవకాశం లభించింది నాకు.  ఆ రోజున పరిచయమయిన పాత్రోతో క్రాంతికుమార్ సినిమాల ద్వారా  కొంత; కుప్పిలి పద్మ ద్వారా  మరికొంత సాన్నిహిత్యం ఏర్పడింది . ఆంధ్ర యూనివర్సిటీ స్టేజి అండ్ డ్రామా డైరెక్టర్ కె. వెంకటేశ్వర రావు. ఆయన వారసుడు పాత్రో. గొల్లపూడి 'కళ్ళు', పాత్రో 'పావలా ', యండమూరి 'కుక్క' - మోడ్రన్ డ్రామా కి దశ -దిశ  నిర్దేశించాయి . ఈ రంగస్థల నేపద్యమే పాత్రోని బాలచందర్ కి దగ్గర చేసింది . కమలహాసన్ కి శ్రీశ్రీ సాహిత్యాన్ని పరిచయం చేసింది. క్రాంతి కుమార్ ఆఫీసులో తరచుగా కలిసేవాళ్ళం. తాజాగా 'దర్శకరత్న' దాసరి గారి ఇంటికి వచ్చినప్పుడు ఆఖరిసారిగా మాట్లాడాను. ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు '' చిత్రంలో సీతారాముల కళ్యాణం సందర్బంగా జరిగే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ : మహేష్ బాబు - వెంకటేష్ ని చెరో వైపు కూర్చో బెట్టుకుని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ లు : ఈ జన్మకే నేను మీ నాన్నని - ఈ జన్మకే వీడు నీ అన్న. 

- ఏమిటి హటాత్తుగా 'వైరాగ్యం' ప్రదర్శించారు అని అడిగాను. 

''ఆ క్యారెక్టర్ అలాంటిది - వెనుక నిలబడివున్న 'రావు'లో మార్పు రావాలి . అంతకుముందు అన్నదమ్ముల మద్య చోటుచేసుకున్న చిన్న గ్యాప్ గురించి 'సీత' ప్రకాష్ రాజ్ కి చెప్పి ఉంది.  ఆ గ్యాప్ ని  పూడ్చడానికి ఆయన అలా మాట్లాడారు. చాలా మంచి సీను అది. డైరెక్టర్ గొప్పగా కన్ సీవ్ చేసాడు'' అన్నారు . 

''నా క్కూడా ...'' అంటూ పాత్రోతో నవ్వు కలిపాను. అదే ఆఖరిసారి పాత్రోని చూడటం . 

'పాత్రో' చితమైన సంభాషణల రచయిత  ఇకలేడు - అన్న నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. 

అదేమి చిత్రమో, వంద ఫైచిలుకు చిత్రాలకు పనిచేసిన పాత్రో ఆఖరి సినిమా ఆఖరి సన్నివేశంలో జన్మ జన్మల ..' ఫిలాసఫీ ...'  ఏమో, ఏ భగవంతుడు ఆయనతో ఎందుకిలా రాయించారో !

 

                                                                       తోటకూర రఘు 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement