పిక్: పవన్ కు చంద్రబాబు పరామర్శ

AP CM Chandrababu meets Pawan Kalyan


అనారోగ్యంతో ముంబై లో చికిత్స పొందుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముంబై లోని కోకిలబెన్ హాస్పిటల్ లో కుడి చేతికి సర్జరీ చేయించుకుని ఉన్నారు.

ఈరోజు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లి కోకిలాబెన్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో లో పవన్ కళ్యాణ్ కుడి చేతికి కట్టు కనిపిస్తుంది. ఆ చేతిపై ఆయన షర్ట్ వేసుకుని ఉన్నారు. చంద్రబాబు కాసేపు పవన్ దగ్గరే కూర్చుని ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన విజువల్స్, ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

Chandrababu - Pawan Kalyan