పవన్ పరామర్శ కోసం ముంబై కి CBN
Chandrababu Mumbai Visit for Pawan Kalyan
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముంబై లో ఉన్నారు. అక్కడ ప్రముఖ ఆసుపత్రి కోకిలాబెన్ లో కుడి భుజానికి నిన్న శనివారం సర్జరీ చేయించుకున్నారు. శనివారం డాక్టర్స్ పవన్ కళ్యాణ్ కుడి భుజానికి మూడు గంటల పాటు ఆపరేషన్ చేసారు.. ఆతర్వాత సర్జరీ సక్సెస్ అయ్యింది, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు.
ఈరోజు ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించేందుకు ముంబై వెళ్లనున్నారు. ఈరోజు చంద్రబాబు ముంబై కోకిల బెన్ ఆసుపత్రికి చేరుకొని అక్కడ కాసేపు పవన్ కళ్యాణ్ ని పరామర్శించి వస్తారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు పవన్ త్వరగా కోలుకోవాలంటూ పలు దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
Chandrababu - Pawan Kalyan







































