Advertisementt

క్రేజ్ కా బాప్... జగన్ ఇంటర్ వ్యూస్

Thu 09th May 2024 12:11 PM
jagan  క్రేజ్ కా బాప్... జగన్ ఇంటర్ వ్యూస్
Jagan క్రేజ్ కా బాప్... జగన్ ఇంటర్ వ్యూస్
Advertisement
Ads by CJ

సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది ? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చినవాటిని ఊడ్చి పడేస్తాయి.

అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది.. ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు...ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.... అచ్చం... అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైయస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ - 9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది... దాంతోబాటు యు ట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది...అందులో అభివృద్ధి, సంక్షేమం...వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. 

ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ - 9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు.. భూ సర్వే గురించి...టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రసంగాలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి...తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు.

దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...రెండో సారి చేస్తే గ్రహపాటు.... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు.. పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు..లక్షల్లో షేర్లు... లైక్స్... కామెంట్స్ తో సోషల్ మీడియా దుమ్ము రేగిపోయింది. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది...మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. 

దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని..అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు.  బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని...అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.

ఒక పక్క మోడి రోడ్ షో జరుగుతున్నా. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి.

అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఎబిఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు.

ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఈమేజ్.వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఈమేజ్ మరోసారి జగన్ ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.

Jagan:

Jagan Interview

Tags:   JAGAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ