అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధుం ధాంగా సాగింది. లక్షలాది మంది జనం కదం తొక్కారు.. సీఎం వైయస్ జగన్ పురిటిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకు ఉన్న పట్టు ఎంత.. ఆ కటౌట్ కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనేదానికి రాప్తాడు సభ ఒక శాంపిల్ మాత్రమే అంటూ వైసీపీ కార్యకర్తలు పూనకాలతో ఊగిపోతున్నారు
భూమిఆకాశాలు ఏకమైనట్లు .. ఎటు చూసినా జనం.. జగన్ మాట్లాడుతున్నంతసేపు చేతులు ఊపుతూ స్పందన.. ఆయన మాటలకూ ఆయన పంచ్ డైలాగులకు కార్యకర్తలు ఉర్రుతలూగారు. సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్లపోడుగునా ట్రాఫిక్ జామ్
జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నలభయ్యేళ్ళ పాలనతోబాటు ఆయన వ్యక్తిత్వాన్ని ఏకిపారేశారు. సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణుల మూడ్ ను మార్చేశాయి. వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు, క్యాడర్, నాయకులకు గొప్ప టానిక్ లా పని చేస్తున్నాయి. దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు.
ఇప్పటివరకు టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు... దీంతో జగన్ కు వస్తున్న ఆదరణను తక్కువ చేసి చూపేందుకు టీడీపీ, ఎల్లోమీడియా నానాపాట్లూ పడుతున్నాయి అంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. జగన్ సభకు జనం రాలేదని ఒకసారి... భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ ప్రజలను నమ్మించడానికి టీడీపీ, జనసేన కష్టపడుతుంది అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో... జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మీడియా ద్వారా అడ్డుకోవడం అంతటి అసాధ్యం అని వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఎవరెన్ని ఎత్తులు, పైఎత్తులు వేసినా తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపథంగా చెబుతున్నారు.




కొడాలి నాని అవుట్.. హనుమంతరావు ఇన్?

Loading..