Advertisementt

బాలయ్య అఖండ 2 పై క్రేజీ న్యూస్

Mon 19th Feb 2024 02:02 PM
akhanda 2  బాలయ్య అఖండ 2 పై క్రేజీ న్యూస్
Crazy news on Akhanda 2 బాలయ్య అఖండ 2 పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ని మార్కెట్ పరంగా, క్రేజ్ పరంగా ఆకాశంలో నిలబెట్టిన చిత్రం బోయపాటి నుంచి వచ్చిన అఖండ నే అనడంలో సందేహం లేదు. బాలయ్య పెరఫార్మెన్స్, బోయపాటి యాక్షన్ మేకింగ్, థమన్ మ్యూజిక్ అన్ని అఖండ ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేసాయి. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా అఖండ 2 ఉంటుంది అంటూ మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసారు. ఈ మధ్యలో బాలయ్య వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా బాబీతో సినిమా చేస్తూ వచ్చారు. ఇక బోయపాటి మాత్రం అఖండ తర్వాత స్కందతో బిగ్ డిసాస్టర్ అందుకున్నారు.

ఇప్పుడు బోయపాటి గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టుగా అనౌన్సమెంట్ వచ్చేసింది. అయితే బోయపాటి ముందుగా బాలయ్యతోనా? లేదంటే అల్లు అర్జున్ తో సినిమా చేస్తారా? అనే విషయంలో క్లారిటీ లేకపోయినా.. ప్రస్తుతం అఖండ 2 పై మాత్రం వార్తలు ఆగడం లేదు. తాజాగా బోయపాటి శ్రీను రాసిన అఖండ 2 కథకు.. మాటల రచయిత ఏం రత్నం డైలాగ్స్ పూర్తి చేశాడని.. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయట.

అంతేకాకుండా అఖండ 2 మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. ఖచ్చితంగా బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని, ఇందులో బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.. మరి ఇది బాలయ్య ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూసే కదా.! 

Crazy news on Akhanda 2:

Akhanda 2 update 

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ