బిగ్ బాస్ 10: త్రిగుణ్ కి దెబ్బేసిన రోహిత్ ఫ్యాన్స్
Bigg Boss 10: Rohit's fans voting for Mukesh
బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లో మొదటి వారం నుంచి కామనర్ రోహిత్ vs సెలెబ్రిటీ త్రిగుణ్ అన్న మాదిరిగానే గొడవలు జరిగాయి. రోహిత్ తో బలవంతగా త్రిగుణ్ పని చేయించడం నచ్చని రోహిత్ త్రిగుణ్ తో గొడవపడేవాడు, త్రిగుణ్ కూడా రోహిత్ ని తెగ ఏడిపించి వదిలాడు. నేను నిన్ను తొక్కుకుంటా పోతా అంటూ త్రిగుణ్ కి రోహిత్ ఛాలెంజ్ కూడా చేసాడు.
కానీ రోహిత్ హౌస్ నుంచి సడన్ గా షాకింగ్ గా ఎలిమినేట్ అవడానికి కారణం త్రిగుణ్. అందుకే రోహిత్ ఫ్యాన్స్ కి త్రిగుణ్ అంటే పీకలదాకా ఉంది. ఇక నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఓటింగ్ లో రోహిత్ ఎప్పుడు త్రిగుణ్ కన్నా ముందు ఉండేవాడు. ఆతర్వాత స్థానంలో మబ్బేష్ అదే ముఖేష్ ఉండేవాడు.
అయితే రోహిత్ ఎలిమినేషన్ కి కారణమైన త్రిగుణ్ పై రోహిత్ రివెంజ్ తీర్చుకోలేకపోయినా రోహిత్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకుంటున్నారు. రోహిత్ వెళ్ళాక త్రిగుణ్ కి ఎదురు లేదు, త్రిగుణ్ కె కప్పు అని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ రోహిత్ ఫ్యాన్స్ త్రిగుణ్ కి బాగా దెబ్బేసారు. కారణం ముఖేష్ హౌస్ లో నామినేషన్స్ టైములో రోహిత్ నువ్వు చెయ్యలేని పని నేను చేస్తా.
త్రిగుణ్ ని తొక్కుకుంటూ పోతా అంటూ రోహిత్ ఫ్యాన్స్ ని తన వైఫుకు తిప్పుకున్నాడు. ఈ వారం ఎవరు ఎవరిని నామినేట్ చేసినా.. బిగ్ బాస్ హౌస్ మొత్తం నామినేషన్స్ లో పెట్టాడు, దానితో రోహిత్ ఫ్యాన్స్ ముఖేష్ కి గుద్ధిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ వారం ఓటింగ్ లో త్రిగుణ్ vs ముఖేష్ అన్నట్టుగా నడుస్తుంది. చాలా స్వల్ప తేడాతో వారి మద్యన పోటీ మొదలయ్యింది.
















































