ఆర్సీ 17 లో రామ చ‌ర‌ణ్ మ్యాన‌రిజం!

Ram Charan's mannerism in RC 17!Ram Charan's mannerism in RC 17!

 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో  తెర‌కెక్కుతున్న `ఆర్సీ 17` ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే మైండ్ బ్లోయింగ్ అంచనాలను నెలకొల్పింది. `రంగస్థలం` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత  ఇద్ద‌రి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈసారి సుకుమార్ ఎలాంటి కాన్సెప్ట్‌తో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. పాత్రలను మలిచే తీరులో సుకుమార్ శైలి  ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యంగా కథానాయకులకు  విలక్షణమైన మ్యానరిజాన్ని జోడించి డిజైన్ చేయడం  అలవాటు.

`రంగస్థలం`లో చిట్టిబాబు పాత్ర కోసం రామ్ చరణ్‌కు వినికిడి లోపం (సౌండ్ ఇంజనీర్) అనే పాయింట్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో తీసిన `పుష్ప` సిరీస్‌లో ఒక భుజం ఎగరేసే మానరిజమ్ ఎంతటి గ్లోబల్ ట్రెండ్‌గా మారిందో  చూశారు. అదే దిశగా `ఆర్సీ 17` కోసం కూడా రామ్ చరణ్ క్యారెక్టర్‌ను సుకుమార్  ఆసక్తికరంగా మ‌లుస్తున్న‌ట్లు సమాచారం. ఈ సినిమాలో చరణ్ పాత్ర కోసం ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ .. రా లైవ్‌లీ మ్యానరిజాన్ని డిజైన్ చేస్తున్నారని టాక్.

ఈ పాత్ర కోసం రామ్ చరణ్  ఫిజిక్‌లోనూ భారీ మార్పులు చేస్తున్నార‌ని..  ప్రత్యేకమైన మేకోవర్‌తో పాటు గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ మార్క్ క్యారెక్టరైజేషన్‌కు చరణ్ అద్భుతమైన నటన తోడైతే వెండితెరపై మరోసారి రికార్డులు తిరగరాయడం ఖాయమని మెగా అభిమానులు విశ్వసిస్తున్నారు. `రంగస్థలం`, `పుష్ప`ల రికార్డులను తిరగరాసేలా ఈ కొత్త మ్యానరిజం .. గెటప్ ఉండబోతోందని  విశ్లేషకులు భావిస్తున్నారు.

Ram Charan's transformation in RC17