ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Don't Trouble the Trouble Before - Now Itlu Arjuna

మొన్న డోంట్ ట్రబుల్-ఇప్పుడు అర్జున

Don't Trouble the Trouble Before - Now Itlu ArjunaDon't Trouble the Trouble Before - Now Itlu Arjuna


గత నెలలో మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ హీరోగా తెరకెక్కిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ని రాజమౌళి కొడుకు కార్తికేయ, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నిర్మించడంతో ఈ సినిమాని చూడమని రాజమౌళి ఫ్యామిలీ దగ్గర నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకు ప్రమోషన్స్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ కూడా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ పై పోస్ట్ వేశారు.

కానీ ఆ చిత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఎంత పెద్ద స్టార్ ఫ్యామిలీ దాని వెనుక ఉన్నా, స్టార్ హీరోస్ సపోర్ట్ చేసినా కంటెంట్ బావుంటేనే సినిమా వర్కౌట్ అయ్యేది. అదే జరిగింది డోంట్ రంబుల్ ద ట్రబుల్ విషయంలో. అదే మాదిరి ఇప్పుడు ఓ చిన్న సినిమా వెనుక టాలీవుడ్ టాప్ స్టార్స్ నిలబడ్డారు.

అదే డెబ్యూ హీరో అనీష్ నటించిన ఇట్లు అర్జున. ఈ చిత్రం మొదటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ, నాగార్జున, అఖిల్ తో పాటు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇట్లు అర్జున్ హీరో అనీష్ ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇట్లు అర్జున సినిమాని చూడమని చెబుతున్నారు.

ఇంతమంది స్టార్స్ వెనుకుండి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆడియన్స్ అమాయకంగా థియేటర్స్ కి పరిగెత్తరు, కంటెంట్ బావుంటేనే వెళ్ళేది అని నిరూపిస్తారో, లేదంటే స్టార్స్ చెప్పారని బెస్ట్ ఓపెనింగ్ ఇట్లు అర్జున్ కి అందిస్తారో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Itlu Arjuna releasing tomorrow