ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan, Who Won’t Compromise There, How Will He Compromise in an Alliance?

అక్కడ కాంప్రమైజ్ అవ్వలేని పవన్.. ఇక్కడెలా?

Pawan, Who Won’t Compromise There, How Will He Compromise in an Alliance?Pawan, Who Won’t Compromise There, How Will He Compromise in an Alliance?


ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నారు. ఆయన వైవాహిక జీవితంలో ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు ఆయనకు కలిసి రాలేదు. మొదటి భార్య నందిని, రెండో భార్య రేణు దేశాయ్, మూడో భార్య అన్నా.. ముగ్గురుతోను పవన్ కళ్యాణ్ ఇమడలేకపోయారు. లోపం పవన్ లో ఉందా, ఆ ముగ్గురు మహిళల్లో ఉందొ అనేది ఇరు వాదనలు వింటే కానీ క్లారిటీ లేదు.

అయితే పవన్ కళ్యాణ్ కేవలం సెలెబ్రిటీ అయితే అదో సెన్సేషన్ న్యూస్ గా మిగిలిపోయేది. ఓ వారం పవన్ విడాకులు గురించి మాట్లాడుకునేవారు, ఆతర్వాత మర్చిపోయేవారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడొక పొలిటికల్ లీడర్, ఓ పార్టీకి అధ్యక్షడు. అంటే పవన్ కళ్యాణ్ విడాకుల గురించి ప్రతి పక్షం వారు చేసే కామెంట్స్ కి పవన్ తల వంచాల్సిందే.

ఆ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ భార్య ల విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు.. అలియెన్స్ లో 15 ఏళ్ళ పాటు కూటమిలో ఎలా ఉంటారు, టీడీపీ, జనసేన బిజెపి లతో కలిసి పొత్తు పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యి పార్టీని గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ ఈ పొత్తు 15 ఏళ్ళ పాటు ఉంటుంది అని ఎప్పటికప్పుడు చెబుతున్నారు.

కూటమి కట్టాక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు తో స్నేహంగానే ఉంటున్నారు. కలిసి చక్కగా కనిపించి కార్యకర్తల్లో, ప్రజల్లో ఊపు తెస్తున్నారు. అంతా బానే ఉంది, మరి వైవాహిక జీవితంలో కాంప్రమైజ్ కాలేని మనిషి.. ఈ అలియెన్స్ లో ఎలా కాంప్రమైజ్ అయ్యి 15 ఏళ్ళ పాటు పొత్తులో కొనసాగుతారు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Pawan Kalyan