ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anirudh Ravichander And Kavya Maran Get Married In Greece

గ్రాండ్ గా అనిరుద్-కావ్య ల వివాహం

Anirudh Ravichander And Kavya Maran Get Married In GreeceAnirudh Ravichander And Kavya Maran Get Married In Greece


ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర ఇంకా సన్ రైజర్స్ అధినేత కావ్య మారన్ ల వివాహం గత రాత్రి గ్రీస్ దేశంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న అనిరుద్, కావ్యాలు దానిని చాలా సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ పెద్దల అంగీకారంతో సైలెంట్ గా పెళ్లి తో ఒక్కటయ్యారు.

గ్రీస్ లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ కి సినీ, రాజకీయ ప్రముఖులు కొద్దిమంది హాజరయ్యారు. సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన భార్య లత, ఇంకా మాజీ సీఎం స్టాలిన్, ఆయన భార్య, ఉదయనిధి స్టాలిన్ లు ఇలా కొద్దిమంది ప్రముఖులు అనిరుద్ - కావ్యాల వివాహ వేడుకలో సందడి చేసారు.

అనిరుధ్ రవిచంద్ర తమ పెళ్లి ఫొటోస్ షేర్ చేస్తూ..  జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే సందర్భం, పైగా ఇది జీవితాంతం అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. గ్రీస్ లోని శాంటారియో సమీపంలో ఓ రిసార్ట్ లోని ఆరుబయట కావ్య మారన్-అనిరుద్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక గ్రీస్ లో పెళ్లి వేడుకలు ముగించుకుని వచ్ఛాకా ఈ నెల 21 చెన్నై లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్. 

Kavya Maran, Anirudh Ravichander Are Married