సాయి ధరమ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్
Sai Dharam Tej woodby Kiranmayi background revealed
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నవంబర్ 5 న హైదరాబాద్ లోనే సాయి ధరమ్ తేజ్ నిశ్సితార్ధం కిరణ్మయి అనే అమ్మాయితో ఇరు కుటుంబాల నడుమ అంగరంగ వైభవంగా జరిగిపోయింది. సాయి ధరమ్ తనకు కాబోయే భార్యను రివీల్ చేసాడు. వచ్చే నెల 10 న సాయి ధరమ్ తేజ్ వివాహం అది కూడా హైదరాబాద్ లోనే..
ఈ వివరాలు తప్ప సాయి ధరమ్ తేజ్ చేసుకోబోయే ఆ కిరణ్మయి ఎవరు, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఎన్ని, ఆమె ఏం చేస్తుంది.. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమా లేదంటే సాయి ధరమ్ ప్రేమించి,పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కుతున్నాడా అనే విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి అభిమానుల్లో.
అయితే సాయి ధరమ్ చేసుకోబోయే కిరణమై వృత్తిరీత్యా ఒక సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కిరణ్మయి ఫ్యామిలీ వ్యాపార రంగంలో రాణిస్తుండగా, ఆమె తండ్రి దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ అని, అంతేకాకుండా టాలీవుడ్‌లో పలు సినిమాలకు ఫైనాన్షియర్‌గా కూడా వ్యవహరించారని సమాచారం.
అత్యంత సంపన్న కుటుంబం నుండి వచ్చిన కిరణ్మయి వందల కోట్లకు వారసురాలైనప్పటికీ, చాలా సాదాసీదాగా, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు. అయితే సాయి ధరమ్ తో చిన్ననాటి స్నేహం, పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కింది.. అని తెలుస్తుంది.
















































