చైతు - శోభితల జూబ్లీహిల్స్ లగ్జరీ విల్లా విశేషాలివే!
Inside Naga Chaitanya and Sobhita Jubilee Hills luxury villa
హీరో నాగ చైతన్య- నటి శోభిత ధూళిపాళ ధాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. పెళ్లి తర్వాత ఈ సెలబ్రిటీ జంట హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన జూబ్లీహిల్స్‌లో 8,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గల విశాలమైన విలాసవంతమైన విల్లాలో నివసిస్తున్నారు. ఈ విల్లా రూపకల్పన ఆధునిక హంగులతో పాటు సంప్రదాయ తెలుగు వాస్తుశిల్ప శైలిని ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దబడింది.
ఇంట్లో ఆరు బెడ్‌రూమ్‌లు, హోమ్ థియేటర్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, లైబ్రరీ, అత్యాధునిక జిమ్‌తో పాటు అందమైన ల్యాండ్‌స్కేప్డ్ బాహ్య ప్రదేశాలు ఉన్నాయి. అలాగే అందమైన డబుల్-హైట్ ఎంట్రన్స్, పెద్ద విక్టోరియన్-స్టైల్ డోర్, విశాలమైన వెరాండా, అంతర్గత ప్రాంగణాలు , టెర్రస్ గార్డెన్లు ఇంటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. క్రీమ్ రంగు గోడలకు అతుక్కుపోయేలా అజూర్ బ్లూ అప్హోల్స్టరీ, అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ల ఫర్నిచర్ ..అందమైన కర్వ్డ్ ఐవరీ-వైట్ మార్బుల్ స్టేర్‌కేస్ ఇంటి అందాన్ని మరింత పెంచు తున్నాయి. ఈ విలాసవంతమైన ప్రాపర్టీ మార్కెట్ విలువ సుమారు 15 కోట్ల వరకు ఉంటుందని నివేదికలు అంటున్నాయి. అలాగే ఈ నివాసం పర్యావరణ హితమైన హంగులతో పాటు ప్లాటినం-రేటెడ్ ఐజీబీసీ గ్రీన్ హోమ్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉండటం విశేషం.
















































