ఏదైనా ఒక్కరోజే టెన్షన్: ఎన్టీఆర్
JR NTR shares interesting memories and insights
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ లో బిజీగా వున్నారు. రీసెంట్ గా భుజానికి తగిలిన గాయంతో రెండు నెలలు రెస్ట్ తీసుకున్న ఎన్టీఆర్ ఈమధ్యనే డ్రాగన్ సెట్ లోకి వెళ్లారు. తాజాగా ఇట్లు అర్జున హీరో అనీష్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ని కలవగా.. అప్పుడు ఎన్టీఆర్ తన పర్సనల్ విషయాలను కూడా అనీష్ తో షేర్ చేసుకున్నారు.
తాను సినిమాల్లోకి వచ్చేటప్పుడు చాలా బరువుగా ఉండేవాడిని, బరువు తగ్గి సినిమాల్లోకి వస్తే బావుండేది, సన్నబడిన తర్వాత సినిమాలు చేస్తే బావుండేది అనిపిస్తుంది.. అంటూ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బరువుగా ఉండే విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ చాలా సినిమాల్లో బరువుగా కనిపించారు. ఆంద్రవాలా, రాఖి చిత్రాల సమయంలో ఎన్టీఆర్ బరువుపై చాలానే ట్రోల్స్ వచ్చాయి. ఆతర్వాత రాజమౌళి ఇచ్చిన సలహాతో నే బరువు తగ్గి పూర్తి ఫిట్ గా మారారు.
ప్రస్తుతం తన హెల్త్, అలాగే ఫిట్ నెస్ విషయంలో పూర్తి సంతృప్తిగా ఉన్నాను అని చెప్పిన ఎన్టీఆర్ తన సినిమా విడుదలకు ముందు రోజు చాలా టెన్షన్ పడతాను అని, నైట్ నిద్ర కూడా పట్టదు అని చెప్పడమే కాదు.. సినిమా రిలీజ్ అయ్యాక అది హిట్ అయినా, పాప్ అయినా ఆ టెన్షన్ ఒక్కరోజే ఉంటుంది, తర్వాత నార్మల్ అవుతాను, పనిలో పడిపోతాను అని చెప్పారు.
మరి చాలా సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ కి ఇప్పటికి రిలీజ్ టెన్షన్ ఉంటుందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
















































