ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nagarjuna Worst Hosting Bigg Boss Telugu 10

బిగ్ బాస్: నాగార్జునపై తీవ్ర విమర్శలు

Nagarjuna Worst Hosting Bigg Boss Telugu 10Nagarjuna Worst Hosting Bigg Boss Telugu 10


బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ రివ్యూయర్స్ నాగార్జున ను తెగ విమర్శిస్తున్నారు. వాళ్ళు కూడా ఒకప్పుడు బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన కంటెస్టెంట్స్ కావడం గమనార్హం. నాగార్జున హోస్టింగ్ పై కామనర్స్ కి సపోర్ట్ చేసే ఓ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు నాగార్జున సెలబ్రిటీస్ కి సపోర్ట్ చేస్తున్నారనే గోల చేస్తున్నారు.

కామనర్స్ ఏమన్నా మాట్లాడితే నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో ఊరుకోరు, అదే సెలెబ్రిటీస్ ఎలా మాట్లాడినా వాళ్ళను విమర్శించరంటూ కామనర్స్ కి వత్తాసు పలికే బిగ్ బాస్ రివ్యూయర్స్ అలాగే పీఆర్ టీమ్స్ రచ్చ సెయ్యడం చూస్తున్నాం. అయితే గత వారం నామినేషన్స్ ఎపిసోడ్ లో వంశి.. వర్షిణిని కులుకుతున్నావ్ అన్నాడు.

అది బూతు.. కానీ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో వర్షిణి నీ బాధ ఏమిటి.. వంశి కులుకుతున్నావ్ అన్నాడు అదేనా అని అడిగారు. అవునండి అంది. కానీ నాగార్జున కులుకుతున్నావ్ అంటే నవ్వుతున్నారు, తుళ్లుతున్నావు అని అర్ధం, అంతేకాని కులుకుతున్నావ్ అంటే మరేదో ఊహించుకోకు అన్నారు. అక్కడ వంశీని నాగార్జున పాయింట్ అవుట్ చెయ్యకుండా వర్షిణి కి నచ్చజెప్పారు.

అదే విషయాన్ని ఆదిరెడ్డి, గీతూ రాయల్ వంటి వారు నాగ్ మామ హోస్ట్ గా పనికిరారు, కులుకుతున్నావ్ అంటే నవ్వడం అంటూ కామెడీ చేస్తూ నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు, అదే కామనర్స్ అయితే వాళ్ళను ఉతికి ఆరేసేవారు అంటూ నాగార్జునని తెగ విమర్శించేస్తున్నారు.

Bigg Boss Telugu 10