ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Are Rohit's fans this crazy?

బిగ్ బాస్: ఇలాంటి వాడిని నెత్తినపెట్టుకున్నారా?

Bigg Boss 10: Are Rohit's fans this crazy?Bigg Boss 10: Are Rohit's fans this crazy?


బిగ్ బాస్ హౌస్ లోకి అగ్నిపరీక్ష తో కామనర్ గా ఎంటర్ అయిన రోహిత్ నాయుడు హౌస్ లో ఎలాంటి ఆట తీరు ప్రదర్శించాడో అనేది బిగ్ బాస్ చూసిన ప్రతి ఒకకిరికి అర్ధమవుతుంది. రోహిత్ ఆట కన్నా ఎక్కువగా మాటలతోనే గడిపేశాడు. షాలిని చుట్టూ తిరిగి ఆట చెడగొట్టుకున్నాడు. వెనుక మాట్లాడి ఆడియన్స్ లో పరువు పోగొట్టుకున్నాడు.

అగ్నిపరీక్ష ద్వారా ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే రోహిత్ హౌస్ లో ఆడకపోయినా, శాలినితో తిరిగినా, త్రిగుణ పై మాట జారినా ఆయన అభిమానులు రోహిత్ ని నెత్తిన పెట్టుకుని నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఓటింగ్ లో నెంబర్ 1 పొజిషన్ లో పెట్టారు. షాలిని ఎలిమినేట్ అవడంతో మావాడికి శని వదిలింది అన్నారు.

రోహిత్ అనేవాడిని త్రిగుణ ట్రిగ్గర్ చేసేవాడు. రోహిత్ కూడా ఏమి తక్కువోడు కాదు. త్రిగుణ, ముఖేష్ లాంటి వాళ్ళను తన నోటితో ఇచ్చిపడేసేవాడు, కాకపోతే ఎల్లో కార్డ్, బ్లాక్ కార్డు తెచ్చుకునే విధంగా రోహిత్ మాట తూలేవాడు. త్రిగుణ మంచోడు కాదు, కానీ నీ సంస్కారం ఏమైంది, నువ్వు ఇంత దిగజారి మాట్లాడాలా, శనివారం రాత్రి నాగార్జున వీడియోస్ వేసి చూపించిన వాటి లో రోహిత్.. ముఖేష్, వర్షిణి, సుధీర్ ల దగ్గర మాట్లాడిన మాటలు అతని ఎలాంటి వాడో నిరూపిస్తున్నాయి.

నూనె రాసి రాడ్ దించడం ఏమిటి, ఆ మాటలేమిటి, అసలు రోహిత్ ని నాగ్ వార్న్ చెయ్యకుండా ఎందుకు ఉన్నారు. రోహిత్ ని హౌస్ మేట్స్ ఎలిమినేట్ చేస్తే రోహిత్ కి అన్యాయం జరిగిపోయింది అని ఏడ్చే ఫ్యాన్స్ కి రోహిత్ వీడియోస్ కనిపించలేదా, అతని వల్గారిటీ మాటలు వినిపించలేదా, ఇలాంటి వాడినా మీరు నెత్తిన పెట్టుకున్నారు అంటూ నెటిజెన్స్ రోహిత్ ఫ్యాన్స్ ని ఏకి పారేస్తున్నారు.

Bigg Boss Telugu 10: Rohit Eliminated