పుట్టబోయే బిడ్డకు రూమ్ సెట్ చేస్తోన్న సమంత భర్త
A glimpse of daddy duties!
సమంత ప్రెగ్నెంట్ అయ్యాక మొదటి నెలలో వర్కౌట్స్ చేస్తున్న వీడియో తో పాటుగా తొమ్మిదో నెల పడిన తర్వాత కూడా హెల్దీగా ఆమె జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ప్రెగ్నెన్సీ జిమ్ జర్నీని షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ ఎనౌన్స్ చేసాక సమంత చాలా తేలిగ్గా వర్కౌట్స్ చేస్తూ, యోగ చేస్తూ భర్త రాజ్ నిడిమోరుతో చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంది.
మధ్య మధ్యలో ఫోటో షూట్స్, తమిళ కుకింగ్ షో కి హోస్ట్ గా చేస్తున్న సమంత తాజాగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం తన భర్త రాజ్ నిడిమోరు బేబీకి సంబంధించిన రూమ్ అంతా సెట్ చేస్తున్న ఒక ఫోటోను సమంత షేర్ చేశారు. సమంత ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటినుంచి ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది .
ఇప్పుడు పుట్టబోయే బేబీ కోసం సమంత ఆమె భర్త ఎంతగా ఎదురు చూస్తున్నారో అనిపించేలా ఆమె షేర్ చేసిన పిక్ కనిపిస్తుంది. అతి త్వరలోనే సమంత డెలివరీ కాబోతుంది. ఆమెకు పాప పుడుతుందా, లేదంటే బాబు పుడతాడా అనే విషయంలో అభిమానులు చాలా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
















































