సూర్య సీన్ పై బజ్ ఏది?

Suriya's Scene: Where is the Buzz?Suriya's Scene: Where is the Buzz?

 

ఈ ఏడాది వరసగా రెండు సినిమాల్తో రూ.200 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయ్యి క్రేజీగా మారిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి ఈఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సూర్య హ్యాట్రిక్ విజయం కోసం వెయిటింగ్.

అయితే సూర్య నుంచి ఈ ఏడాది మూడో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సీన్ చిత్రంపై ప్రేక్షకుల్లోనూ, అలాగే ట్రేడ్ లోను బజ్ ఎంతుంది అనే విషయంలో అందరిలో ఆసక్తి కనిపిస్తుంది. నవంబర్ 6 న విడుదల కాబోతున్న సీన్ చిత్రం పై అంచనాలు ఎంత ఉన్నాయి అనేది క్లారిటీ రావడం లేదు.

సూర్య, హీరోయిన్ నజ్రియాలు సీన్ చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేస్తున్నారు. కానీ రూ.200 కోట్ల క్లబ్బు హీరో నుంచి సినిమా వస్తుంది అంటే ఆ చిత్రం పై హైప్ ఎంతుండాలి, కానీ సూర్య సీన్ కి అంత సీన్ ఉన్నట్లుగా కనిపించడం లేదు అనే కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరి రెండుసార్లు బ్యాక్ టు బ్యాక్ రూ.200 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన హీరో సూర్య మూడో చిత్రం మొదటిరోజు అంటే ఓపెనింగ్స్ రోజు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

Suriya's Scene