ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Aadarsha Kutumbam: Bad Promotions and Poor Buzz

ఆదర్శం ఇంతేనా?

Aadarsha Kutumbam: Bad Promotions and Poor BuzzAadarsha Kutumbam: Bad Promotions and Poor Buzz

 

ఆదర్శ కుటుంబం రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్-వెంకీ కాంబో అంటే హై లో ఉండాల్సిన అంచనాలు.. ఆదర్శ కుటుంబానికి మాత్రం నేల చూపులు చూస్తున్నాయి. అసలే టికెట్ రేట్ల బండ ప్రేక్షకుల నెత్తిన వేశారు, ట్రేడ్ లో బజ్ లేదు, ప్రేక్షకుల్లో ఊపు లేదు. అలాంటిది ఆదర్శ కుటుంబానికి ప్రమోషన్స్ ఎలా ఉండాలి.

ఏదో సుమ ఇంటర్వ్యూ చేసేసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేసి దర్శకుడు, హీరో చేతులు దులిపేసుకోవడమేనా, హీరోయిన్ ప్రమోషన్స్ చేస్తే ఏమొస్తుంది క్రేజు, వెంకీ మీడియాకి ఇంటర్వూస్ ఇస్తూ త్రివిక్రమ్ ప్రెస్ తో మాట్లాడితే ఎంతోకొంత సినిమాకి ఊపొస్తుంది. కానీ ఆదర్శం విషయంలో టీమ్ లైట్ గా ఉంది.

అసలే.. లో బజ్ సినిమాకి ప్రమోషన్స్ తో హైప్ తెప్పించాలి కానీ.. టీం ఓ ప్రెస్ మీట్, ఓ ఇంటర్వ్యూ, ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సరిపోతుందా అంటూ సినీప్రియులు మాట్లాడుకుంటున్నారు.

Aadarsha Kutumbam