BB10: ఇంట్రెస్టింగ్ రోహిత్ కి త్రిగుణ్ ఎలివేషన్
Bigg Boss Telugu 10 : Thrigun Gives Tough Competition to Rohit!
బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి వారం నుంచి నువ్వా-నేనా అని మాటల యుద్ధంలో తలపడుతున్న రోహిత్, త్రిగుణ్ మధ్యన ఎలాంటి వార్ నడుస్తుందో అనేది బిగ్ బాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇద్దరికిద్దరే.. మాటలు వదిలేస్తారు, రా చూసుకుందాం అంటూ కొట్టుకునేవరకు వెళతారు.
త్రిగుణ్ రోహిత్ ని ఏడిపిస్తే రోహిత్ ట్రిగ్గర్ అయ్యి త్రిగుణ్ ని తిడుతూ రా గేటు బయట చూసుకుందాం అంటూ హోస్ట్ నాగ్ తో తిట్లు తింటాడు, అలాగని త్రిగుణ్ ఏమి మంచోడు కాదు, ఆటలో మేటి, మాటలో వేస్ట్ ఫెలో అన్నట్టుగా బిహేవ్ చేస్తాడు. రోహిత్ ఇష్టపడే శాలినిని త్రిగుణ్ తన ఓట్ పవర్ తో హౌస్ నుంచి పంపెయ్యడం రోహిత్ తీసుకోలేకపోతున్నాడు.
ఇక త్రిగుణ్ షాలిని కి ఎగ్జిట్ ట్యాగ్ వేస్తూ ఎక్కడో నాకు రోహిత్ ఆట నచ్చింది అందుకే అతనికి వెయ్యడం లేదు అన్నాడు, సోమవారం నామినేషన్స్ లోను రోహిత్ ని నామినేట్ చేస్తూ రోహిత్ మాట ఎలా ఉన్నా అతని ఆట తీరు ఎక్కడో నచ్చి నేను షాలిని ని ఎగ్జిట్ చేశాను అంటూ రోహిత్ కి ఎలివేషన్ ఇచ్చాడు. కానీ రోత రోహిత్ మాత్రం అది కూడా తీసుకోలేకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఈ సీజన్ లో 50 రోజుల పాటు ఓటింగ్ లో హవా చూపించిన రోహిత్ పతనం స్టార్ట్ అయ్యింది, మెల్లగా రోహిత్ ని త్రిగుణ్ బీట్ చేసేస్తున్నాడు.
















































