అడ్వాన్స్ బుకింగ్స్ లో రామాయణ క్రేజ్
Ramayana : The advance booking battle is heating up!
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నితీష్ తివారి తెరకెక్కించిన రామాయణ ఈ వారమే విడుదలకు సిద్దమైంది. రామాయణ పార్ట్ 1 నవంబర్ 6 న విడుదల రాబోతుంది. అంతకుముందే ప్రీమియర్స్ తో రామాయణ హడావుడిని మేకర్స్ మొదలు పెట్టబోతున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత గా, యశ్ రావణ్ గా కనిపించబోతున్న ఈ రామాయబ పై క్రేజ్ ఎంత అనేది ఇప్పటివరకు చెప్పడం కష్టంగానే మారింది.
కానీ రామాయణ అడ్వాన్స్ బుకింగ్ చూస్తే రామాయణపై ఇంత క్రేజా అని అనుకొకమానరు. రామాయణ చిత్రం పై ఎన్ని అంచనాలున్నాయి, ఆ సినిమాపై ఉన్న హైప్ ని ఈ అడ్వాన్స్ బుకింగ్స్ స్పష్టత నిస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ రామాయణాన్ని తెరకెక్కించినా.. నటులు మారినా, కథ కొత్తది కాకపోయినా హిందువుల్లో రామాయణపై ఎందుకింత క్రేజ్ అనేది సమాధానం లేని ప్రశ్నే.
ఇక రామాయణ ప్రమోషన్స్ కూడా సినిమాపై విపరీతమైన ఆసక్తిని కలిగేలా చెయ్యడంలో హెల్ప్ అయ్యాయనే చెప్పాలి.
రామాయణ పార్ట్ 1 ఈ దివాళి కి విడుదలవుతుంటే.. పార్ట్ 2 ని 2027 దివాళి నుంచి వాయిదా వేశారు. అది 2028 కి వెళ్లబోతుంది అనే టాక్ నడుస్తుంది.
















































