ఊహకందని అభిమానం
Vishwak Sen fan meet cancelled
నిజమే హీరో విశ్వక్ సేన్ తనకు అంతమంది అభిమానులు ఉన్నారని కానీ, అంత అభిమానం తనపై ఉంది అని కానీ ఊహించి ఉండరు. అందుకే ఫ్యాన్స్ మీట్ అంటూ హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న సారధి స్టూడియో లో పెట్టిన ఫ్యాన్స్ మీట్ కి కోకోల్లలుగా వచ్చిన అభిమానులను మ్యానేజ్ చెయ్యలేక ఫ్యాన్స్ మీట్ క్యాన్సిల్ చేసారు.
తాను ఎంత అనుకున్నారో అంతకుమించిన అభిమానులు సారధి స్టూడియో కి క్యూ కట్టారు. ఆదివారం కావడంతో పాస్ లు లేని వారు కూడా సారధి స్టూడియో కి వచ్చేసారు. విశ్వక్ సేన్ తో ఫోటో దిగాలనే కోరికతో వారు అమీర్ పేట లోని సారధి స్టూడియో కి రావడంతో ఊహించని అభిమానం చూసి విశ్వక్ సేన్ ఫ్యాన్స్ మీట్ క్యాన్సిల్ చేసి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఈ ఈవెంట్ ని నిర్వాహకులు సరిగా మ్యానేజ్ చేయకపోవడంతో విశ్వక్ సేన్ అభిమానులు కలవలేకపోయారు. అది చూసినవారు విశ్వక్ సేన్ కూడా ఊహించి ఉండరు, తనకు ఇంతమంది అభిమానులు ఉన్నారని, నిజంగా ఇది ఊహకందని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
















































