ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pooja Hegde serves timeless ethnic elegance in a beige

టిష్యూ సిల్క్ చీరలో పూజా హెగ్డే గ్లామర్ విందు

Pooja Hegde serves timeless ethnic elegance in a beigePooja Hegde serves timeless ethnic elegance in a beige

గ్లామర్ ప్రపంచంలో తనదైన శైలితో ట్రెండ్ సెట్ చేసే నటి పూజా హెగ్డే మరోసారి  ట్రెడిషనల్ లుక్‌తో ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటనతో అందంతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ తాజాగా ధరించిన ఎన్సెబుల్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రసిద్ధ డిజైనర్ అర్పితా మెహతా బ్రాండ్‌కు చెందిన 1,91,000 విలువైన బంగారు వర్ణపు టిష్యూ సిల్క్ చీరలో అమ్మ‌డు మెరిసిపోయిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ చీర ప్రత్యేకత ఏంటంటే? అత్యంత సున్నితమైన టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్‌తో తయారై ప్రత్యేకమైన మెరుపును సంతరించుకుంది. వెడ్డింగ్ సెర్మనీలు .. పండుగ వేడుకలకు ఇది ఎంతో సరిగ్గా సరిపోయేలా క్లాసీ లుక్‌ను ఇస్తుంది. ఈ చీరకు మరింత అందాన్ని తెచ్చేలా నెట్ బ్లౌజ్‌ను జతచేశారు. బేజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ దుస్తులకు ఒక క్లాసిక్ అప్పీల్‌ను తీసుకురాగా.. స్టైలిస్ట్ గరిమా గార్గ్ అద్భుతమైన రీతిలో పూజా హెగ్డేను స్టైలింగ్ చేశారు.

ఈ ట్రెడిషనల్ లుక్‌కు తగినట్లే మేకప్ .. హెయిర్ స్టైల్ చాలా సింపుల్‌గా.. సోఫిస్టికేటెడ్‌గా ఉంచడం విశేషం. సబ్‌టిల్ లైన్డ్ ఐస్, న్యూడ్ పింక్ పెదవులు, మైల్డ్ బ్లష్‌తో కూడిన సాఫ్ట్ మేకప్ చీరలోని మెరుపును హైలైట్ చేసేలా చేసింది. అలాగే ఆమె షార్ట్ హెయిర్‌ను సాఫ్ట్ వేవ్స్‌గా తీర్చిదిద్దడం ద్వారా లుక్‌ మొత్తం రిలాక్స్‌డ్ అండ్ ఎగ్‌జోటిక్ టచ్‌ను సంతరించుకుంది. ఏ వేడుకలోనైనా ప్రత్యేకంగా నిలవాలనుకునేవారికి పూజా హెగ్డే ఈ లుక్ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.

 

 

Pooja Hegde is making waves with her latest ethnic appearance