ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ravi Kishan plays Lord Rama for the first time at Delhi

దశాబ్దాల పోరాటాన్ని గుర్తుచేసుకున్న రవికిషన్!

Ravi Kishan plays Lord Rama for the first time at Delhi Ravi Kishan plays Lord Rama for the first time at Delhi

ప్రముఖ నటుడు, పార్లమెంట్ సభ్యుడు రవికిషన్ ఢిల్లీలో జరిగిన అయోధ్య కీ రామ్‌లీలా వేదికపై మొదటిసారిగా శ్రీరాముడి పాత్రను పోషించారు. ఈ సందర్భంగా తన నటనా ప్రయాణాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. చిన్నతనంలో రామ్‌లీలా నాటకాల్లో సీతాదేవి పాత్ర ధరించడం నుంచి నేడు స్వయంగా శ్రీరాముడి పాత్రను పోషించే స్థాయికి ఎదగడం తన జీవితంలో మర్చిపోలేని మలుపు అని దీని వెనుక ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమ , పోరాటం ఉన్నాయని  వెల్లడించారు.

శ్రీరాముడి పాత్రలో కనిపించడం తనలోని ఆధ్యాత్మిక భావనను మరింత పెంచిందని రవికిషన్ తెలిపారు. నేటి యువత భారతీయ సంస్కృతి, మూలాలను మరచిపోకూడదని పిలుపునిచ్చారు. యువతరం ప్రతి ఒక్కరూ శ్రీరాముడు, శ్రీకృష్ణుడు , పరమశివుడి పవిత్ర జీవిత చరిత్రలు, గ్రంథాలను తప్పకుండా చదవాలని, వారి ఆదర్శాలను తమ జీవితాల్లో ఆచరించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన రవికిషన్ `అయోధ్య కీ రామ్‌లీలా`లో శ్రీరాముడిగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ పవిత్రమైన పాత్రను పోషించడం ద్వారా తన జన్మ ధన్యమైందని.. సమాజానికి మంచి సందేశాన్ని అందించే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగం కావడం ఎంతో గర్వకారణమని  సంతోషం వ్యక్తం చేశారు.

BJP MP Ravi Kishan on playing Lord Ram in Ayodhya Ki Ramleela