ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> 7th week nominations in Bigg Boss Telugu 10

BB10: ఆ ముగ్గురు తప్ప అందరూ నామినేషన్స్ లోకే..

7th week nominations in Bigg Boss Telugu 107th week nominations in Bigg Boss Telugu 10


బిగ్ బాస్ సీజన్ 10 గత వారం షాలిని ఎలిమినేషన్ తప్పించుకుని సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళింది, ఆ విషయం తెలియని హౌస్ మేట్స్ ఆమెపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుకున్నారు. అన్ని సీక్రెట్ రూమ్ నుంచి చూసిన షాలిని ఇకపై తన ఆట లో ఎలాంటి మార్పులు చేర్పులు చూపిస్తుందో తెలియదు కానీ.. గత వారం ఎలిమినేషన్ నుంచి, అలాగే ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకుని హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ వారం నామినేషన్స్ హీట్ హౌస్ లో మాములుగా లేదు. వైల్డ్ ఫైర్స్, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ మధ్యన మాటల యుద్ధమే కాదు, ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ నడుమ కూడా ఆర్గ్యుమెంట్స్ మాములుగా జరగలేదు. త్రిగుణ vs రోహిత్, త్రిగుణ vs సుధీర్, నీతూ vs వర్షిణి ఇలా హౌస్ లో చాలా పెద్ద గొడవలే జరిగాయి.

ఇక ఈ వారం నరేష్, దేబ్జానీ, అమన్, ముఖేష్ లను ఎవరూ నామినేట్ చేయకపోవడంతో ఆ నలుగురిలో ఒకరిని కెప్టెన్ రాంప్రసాద్ ని డైరెక్ట్ నామినేషన్ వెయ్యమంటే రామ్ ప్రసాద్ అమన్ ను నామినేట్ చేసాడు. దానితో హౌస్ లో ఉన్న మొత్తం కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వెళ్లారు నరేష్, దేబ్జానీ, ముఖేష్ తప్ప.

సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, లేదంటే సింగిల్ ఉంటుందా, అందులోను ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్ళబోయేది ఎవరో అనే విషయం ఆసక్తికరంగా మారింది.  

Bigg Boss Telugu 10 7th Week Nominations List