చరిత్ర చూపించని నిజాన్ని ఆవిష్కరించారు!
Ranabaali Real Story: When nearly 1 crore died in the Great Madrasవిజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా `రణబాలి` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా సినిమాపై, చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. విమర్శకులు, ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న ఈ చిత్రంపై వంగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
విజయ్ దేవరకొండ నటన, రష్మిక పాత్ర పోషణ అద్భుతంగా ఉన్నాయని సందీప్ రెడ్డి వంగా కొనియాడారు. `అందరూ తప్పకుండా థియేటర్లకు వెళ్లి ``రణబాలి` సినిమాను చూడండి. దేవరకొండ విజయ్ సాయి పాత్రను ఆవిష్కరించిన తీరు అత్యుత్తమంగా ఉంది. ఇక విజయ్, రష్మికల జంట కేవలం ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. అంతకుమించిన బంధం వారి నటనలో కనిపించింది` అని పేర్కొన్నారు.
అలాగే సినిమాలో రష్మిక మందన్న పోషించిన 'జయమ్మ' పాత్ర ఎంతో సహజంగా.. హృదయానికి హత్తుకునేలా ఉందంటూ వంగా ప్రత్యేకంగా అభినందించారు. చిత్రానికి అజయ్-అతుల్ అందించిన సంగీతం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ మన చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాన్ని అత్యంత శ్రద్ధతో, జిజ్ఞాసతో తెరపైకి తీసుకువచ్చారని కొనియాడారు.
భారతీయ పాఠ్యపుస్తకాలు సైతం చూపించడానికి వెనుకాడిన మన హిస్టరీలోని ఒక అరుదైన కోణాన్ని ఈ సినిమాలో చూపించారని సందీప్ వంగా అభిప్రాయపడ్డారు. `ఈ సినిమా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాలేదు. తీవ్రమైన అకడమిక్ ప్రాధాన్యత కలిగిన అంశాన్ని మన ముందుకు తెచ్చింది` అని వ్యాఖ్యానించడం విశేషం.
















































