AK 47 రిలీజ్: తనపై సెటైర్ వేసుకున్న నిర్మాత

Naga Vamsi About AK 47 Release DateNaga Vamsi About AK 47 Release Date

 

జైలర్ 2 సక్సెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ ని ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ విషయం చెప్పమంటే.. నాగవంశీ తనపైన తానే సెటైర్ వేసుకున్నారు. నేను రిలీజ్ డేట్ చెప్తే నన్ను తంతారు, హీరో వెంకటేష్ గారే ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ రివీల్ చేస్తారు అంటూ తప్పించుకున్నారు.

అక్టోబర్ 2, అక్టోబర్ 9 నుంచి రిలీజ్ డేట్స్ చేంజ్ చెయ్యడమే నాగవంశీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కారణమైంది. అక్టోబర్ 9 నుంచి చివరి నిమిషంలో వాయిదా వేసి ట్రోల్ అయ్యారు. ఇప్పుడు అక్టోబర్ 30 న AK 47 రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలను కూడా నాగవంశీ ధ్రువీకరించలేదు. మీరు అనుకున్న తేదీకే ఆదర్శ కుటుంబం రిలీజ్ ఉంటుంది.

కాకపోతే అది హీరో వెంకటేష్ గారే చెబుతారు, నేను చెబితే నన్ను తంతారు. వెంకటేష్ గారు ఈ నెల 20 న ఊటీలో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ రాగానే 21 తర్వాత ట్రైలర్ లాంచ్ చేసి ఆదర్శకుటుంబం విడుదల తేదీ రివీల్ చేస్తారని నాగవంశీ తనపై తానే సెటైర్ వేసుకున్నారు.

Naga Vamsi Says Venkatesh Will Announce Release Date Of Aadarsha Kutumbam