ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jailer 2 crosses Rs 200-crore mark worldwide

జైలర్ 2: రెండు రోజులు రూ.200 కోట్లు

Jailer 2 crosses Rs 200-crore mark worldwideJailer 2 crosses Rs 200-crore mark worldwide


సూపర్ స్టార్ రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో జైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 చిత్రం విడుదలైన మరుక్షణం నుంచే పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తుంది, జైలర్ 2 ఫస్ట్ హాఫ్ ఎక్సట్రార్డినరీ, సెకండ్ హాఫ్ కాస్త డల్ అన్నా ఓవరాల్ గా జైలర్ 2కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది.

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన భారీ యాక్షన్ సీక్వెల్ జైలర్ 2 విడుదలైన రెండు రోజుల్లోనే కళ్లు చెదిరే మైలురాయిని అధిగమించింది. జైలర్ 2 రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 209.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్, ఇండియా ఎక్కడ చూసినా జైలర్ 2 హవా కొనసాగుతుంది.

కేవలం రెండు రోజుల్లోనే ఓవర్సీస్ లో జైలర్ 2 గ్రాస్ వసూళ్లు రూ. 97 కోట్ల మార్కుకు చేరాయి. శనివారంతో ఓవర్సీస్‌లో ఈ చిత్రం ఈజీగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటడం ఖాయం. జైలర్ 2లో అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్, విద్యాబాలన్, హృతిక్ రోషన్ వంటి స్టార్ క్యామియోలు అన్ని ఈ చిత్రం హిట్ లో భాగమయ్యాయి.

Rajinikanth-starrer Jailer 2 crosses Rs 200-crore mark worldwide in two days