ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naga Vamsi Asks Media to Stop Ticket Hike Negativity

టికెట్ రేట్స్ హైక్ నాగవంశీ లాజిక్

Naga Vamsi Asks Media to Stop Ticket Hike NegativityNaga Vamsi Asks Media to Stop Ticket Hike Negativity

 

ఈమధ్యన ఒరిజినల్ తెలుగు సినిమాలకు టికెట్ రేట్ల హైక్ కోసం నిర్మాతలు సీఎం ల దగ్గరకు వెళ్లి జీవో లు తెచ్చుకోకుండానే నార్మల్ రేట్ల తో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి అద్భుతమైన లాభాలు వెనకేసుకుంటున్నారు. అదేసమయంలో డబ్బింగ్ చిత్రాలకు టికెట్ రేట్లు పెంచమని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నిర్మాతలు వేడుకుంటున్నారు.

డబ్బింగ్ చిత్రాలకు టికెట్ రేట్లు పెరగడమేమిటి అని ప్రేక్షకులే సెటేరికల్ మాట్లాడుతున్నారు. నిర్మాతలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మొన్న టాక్సిక్, నిన్న జైలర్ 2 కి టికెట్ రేట్ల హైక్ మరీ కామెడీగా మారిపోయింది. అయితే ఈ టికెట్ రేట్ల హైక్ పై జైలర్ 2 ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ లాజిక్స్ మట్లాడారు.

ప్రతి థియేటర్ లో టికెట్ రేట్లు ఒకలా ఉండవు. మల్టిప్లెక్స్ లో ఒక రేటు ఉంటుంది. అంతెందుకు బెంగుళూరులో టికెట్ రేట్ రూ.1800 వుంది. ఒక్కోచోట 2 వేలు ఉంది. మీరు పక్క రాష్ట్రమైన కర్ణాటక వెళ్లి సినిమాలు చూస్తే తెలుస్తుంది. మన మీడియా వాళ్ళని అక్కడికి పంపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా.. అంటూ టికెట్ రేటు పెంపులో తప్పులేదు అని ఆయన సమర్ధించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

Producer Naga Vamsi Reacts on Ticket Rates