జైలర్ 2 కి ఏది ప్లస్సో.. రణబాలి కి అది మైనస్
What is a plus for Jailer 2 is a minus for Ranabaali
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్టింగ్, ఆయన స్టయిల్, మెయిన్ హైలెట్ అనిరుద్ రవిచంద్ర BGM. జైలర్ చిత్రమే కాదు, జైలర్ 2 చిత్రానికి కూడా అనిరుద్ నేపధ్య సంగీతం ప్లస్ అయ్యింది. జైలర్ 2 బ్లాక్ బస్టర్ హిట్టులో మేజర్ హైలెట్ BGM. అనిరుద్ రవిచంద్ర BGM సూపర్ స్టార్ కి ఎలివేషన్ ఇవ్వడమే కాదు, కీలక సన్నివేశాల్లో BGM ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కానీ రణబాలి విషయంలో అలా జరగలేదు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన రణబాలి చిత్రానికి నేపధ్య సంగీతమే మైనస్ అయ్యింది. బ్రిటిష్ కాలం నాటి సన్నివేశాలను హైలెట్ చెయ్యాల్సిన నేపధ్య సంగీతం డల్ అయితే అది సినిమా రిజల్ట్ పై పడుతుంది. రణబాలి నెగెటివ్ అంశాల్లో BGM అనేది కీలకంగా చెబుతున్నారు.
మరి సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2కి ఏది అయితే ప్లస్ అయ్యింది, అది విజయ్ దేవరకొండ రణబాలి లో మైనస్ అయ్యింది. రణబాలి ని అజయ్-అతుల్ నేపధ్య సంగీతం కిల్ చేసింది అంటూ విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
















































